గుట్కా పై నిషేదం సరైన నిర్ణయమే: తెలంగాణ హైకోర్టు..

R9TELUGUNEWS.COM
గుట్కా, పాన్ మాసాలాపై నిషేధాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థించింది. రాష్ట్రంలో గుట్కా నిషేధాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో 160 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. కరోనా కంటే గుట్కా వల్లే ఎక్కువ మంది మరణిస్తున్నారని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది.