కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థులు ఎవరో తెలియదు…. క్రమశిక్షణ లేకుండా నిన్న దేవరకొండ నియోజకవర్గంలో తన్నుకుంటున్నారు.శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..

నల్గొండ : తన నివాసంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం.

గుత్తా సుఖేందర్ రెడ్డి(gutta sukhendar reddy) మాట్లాడుతూ……

పాదయాత్రలు ఆధిపత్య పోరు కోసం తప్ప ప్రజల కోసం కాదు.

రేవంత్,(revanth Reddy) బండి సంజయ్(bandi sanjay) పాదయాత్రలు చేసి అలసిపోయారు…

భట్టి(batti) పాదయాత్ర చేస్తున్న డిండి ప్రాంతంలోనే రెండు పంటలకు నీరు ఇచ్చింది కనపడడం లేదా.

ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో ఎన్నో సాంకేతిక సమస్యలతో నాలుగేళ్లుగా శ్రీశైలం(seishalam) నీటితో నిండుతోంది.

టన్నెల్ మరమ్మతులకు గురైతే ఆరు నెలలు ఆగాల్సి ఉంది….టన్నెల్ ఇంకా 9 కి.మీ మిగిలి ఉంది.

డిండి ఎత్తిపోతల పథకాల్లోని ప్రాజెక్టులు పూర్తి కావస్తున్నాయి, ఇప్పటికే రెండు వేలకు కోట్లకు పైగా ఖర్చయ్యాయి.

కాంగ్రెస్ పార్టీ హాయాంలో కాలువలు తవ్వి వదిలి పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు తెచ్చింది.

తిక్కల భట్టి ఏఎమ్మార్పీపూర్తి చేసిన ఘనత బీఆర్ఎస్ దీ… హైదరాబాద్ లో మీ ఇంటికి కూడా నీళ్లు వచ్చాయనేది మర్చిపోవద్దు.

భట్టికి మధిర నియోజకవర్గం తప్ప ఏదీ తెలియదు..రాజశేఖర్ రెడ్డి లాగా పంచ దోతి కట్టడం తప్ప.

తొమ్మిదేళ్ల పాలనలో జిల్లాలో జరిగిన అభివృద్ధి మేము చేసిన ప్రగతికి నిదర్శనం.

ఇరవై ఐదు ఏళ్లుగా మేము ఎంపీగా ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నాం.

కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థులు ఎవరో తెలియదు…. క్రమశిక్షణ లేకుండా నిన్న దేవరకొండ నియోజకవర్గంలో తన్నుకున్నారు.

బీజేపీ(BJP), కాంగ్రెస్(congress) కలలు కన్నా ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు.