ప్రధాన మంత్రి మోదీ పర్యటన వల్ల తెలంగాణకు ఓరగేది ఏం లేదు..శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..

నల్గొండ

నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.

*ప్రెస్ మీట్ లో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడిన అంశాలు…ప్రధానమంత్రి మోడీ ఇవ్వాళ పాలమూరు జిల్లాకు వస్తున్నారు. వచ్చిన ప్రతి సారి మొండి చెయ్యి ఇచ్చి పోతారు.
ప్రధాన మంత్రి మోదీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరి ఇవ్వరు. మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ పథకం కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎంత సేపు తెలంగాణ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. ప్రధాన మంత్రి మోదీ పర్యటన వల్ల తెలంగాణకు ఓరగేది ఏం లేదు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి.
ఇక గవర్నర్ ఏవేవో మాట్లాడుతున్నారు. ఆరోపణలు చేస్తున్నారు. గవర్నర్ గారిపై ఎవ్వరు రాళ్లు వేయడం లేదు.ఆమె మాత్రం ఆవేదన పడుతున్నారు. గవర్నర్ గారు ఆవేదన ఏంటో అర్థం కావడం లేదు..ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో నల్గొండ జిల్లాలో ఊహించని విధంగా అభివృద్ధి జరిగింది. రేపు KTR గారు నల్గొండలో పర్యటిస్తున్నారు. ఐటి హబ్ ప్రారంభిస్తున్నారు.నల్గొండలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి గారు నల్గొండ ను అందంగా అభివృద్ధి చేశారు.అందమైన జిల్లా కేంద్రముగా నల్గొండ పట్టణం మారింది.కెసీఆర్ గారు , కేటీఆర్ గారి కృషి వల్లనే అభివృద్ధి జరిగింది…కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మతి భ్రమించింది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా మతి భ్రమించింది.