గువ్వల బాలరాజు పై మరోసారి దాడి….

గువ్వల బాలరాజు పై మరోసారి దాడి.

అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై మూడు రోజుల వ్యవధిలో సోమవారం రాత్రి మరోసారి దాడి జరిగింది.

నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయనపై మతిస్థిమితంలేని వ్యక్తి మట్టిపెళ్ల విసిరాడు.

అయితే బాలరాజు అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే అప్రమత్తమయ్యారు. దాడికి పాల్పడిన తిరుపతయ్య అనే వ్యక్తిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు.