జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగ ఆరాధనపై వారణాసి కోర్టు తీర్పు వాయిదా..!!

జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగ ఆరాధనపై వారణాసి కోర్టు తీర్పు వాయిదా పడింది.ఈనెల 14వ తేదీకి తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగ ఆరాధనకు అనుమతి ఇవ్వాలంటూ వారణాసి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్‌లోకి ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని కూడా పిటిషనర్‌ కోరారు. జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్‌ను సనాతన్‌ సంఘ్‌కు అప్పగించాలని కోరుతూ మే 24న పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు సివిల్‌ జడ్జి మహేంద్ర పాండే తీర్పు వాయిదా వేశారు…