గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా.. !!..ఈ ఆహార పదార్థాలను తినడం మానుకోండి..!!!

గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా?…
〰〰〰〰〰〰〰〰
ఈ మధ్య చాలా మందికి గ్యాస్‌ సమస్య వస్తుంది. దీంతో వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే లో–ఫోడ్‌మ్యాప్‌ ఆహారం తీసుకోవడంతో ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సమస్య తగ్గాలంటే వరి అన్నం, గ్లూటెన్‌ ఫ్రీ బ్రెడ్‌ తీసుకోవాలి…
☛ అరటిపండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది గ్యాస్ ను నియంత్రణలో ఉంచుతుంది. అరటిపండ్లు తినడం వల్ల ఎసిడిటీ రాదు.
☛ పుచ్చకాయ తినడం వల్ల గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
☛ దోసకాయ తీసుకుంటే కడుపులో మంట తగ్గుతుంది.
☛ గ్యాస్ నుంచి ఉపశమనం పొందడంలో అంజీర్ కీలక పాత్ర పోషిస్తుంది…

*** అరటి, నేరేడు, ద్రాక్ష, కివీ, నిమ్మ, బత్తాయి, నారింజ, బొప్పాయి, పైనాపిల్, స్ట్రాబెర్రీ ఎక్కువగా తినాలి. కూరగాయల్లో క్యారట్, దోస, అల్లం, మిరియాలు, లెట్యూస్, ఆలుగడ్డ, పాలకూర, టొమాటో తింటే గ్యాస్ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. చికెన్, ఫిష్‌, పల్లీలు, వాల్‌నట్స్‌ వంటి పదార్థాలు తీసుకోవాలి…

వీటివల్ల గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అవుతుంది..!!!

గ్యాస్‌ సమస్య ఉన్నవారు పాస్తా, కేక్‌ బిస్కెట్స్, పియర్, ప్రూన్, పీచ్, చెర్రీస్, వెజిటబుల్స్‌లో బ్రాకలీ, కాలీఫ్లవర్, ఉల్లి, వెల్లుల్లి, బీట్‌రూట్స్, ప్రోటీన్స్‌లో బీన్స్, సోయాబీన్స్‌ వంటి వాటికి నుంచి దూరంగా ఉండాలి….