హబ్సిగూడ లోని బార్ అండ్ రెస్టారెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం..!

హబ్సిగూడలోని అన్ లిమిటెడ్ బార్ అండ్ రెస్టారెంట్, రేమండ్ షోరూం బిల్డింగ్ పైన ఈరోజు తెల్లవారుజామున ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుట అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.