హైకోర్టులో ఉన్న అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసుల్లో కీలక పరిణామం..

హైకోర్టులో ఉన్న అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసుల వివాదాలన్నీ ఏపీలోని ఏలూరు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది తెలంగాణ హైకోర్టు. వేలం ద్వారా వచ్చిన రూ.50 కోట్లు కూడా ఏలూరు కోర్టుకు బదిలీ చేసింది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ వివాదాలు ఏడేళ్లుగా హైకోర్టులో కొనసాగుతున్నాయి. విచారణ కొనసాగించాలన్న డిపాజిటర్లు, బ్యాంకుల అభ్యర్థనను తిరస్కరించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని ఏలూరు కోర్టును ఆదేశించింది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ సంబంధించిన కేసులన్నింటిపై విచారణ ముగించింది హైకోర్టు.