హాలియా మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశానికిహాజరైన ఎంపీ కెప్టెన్ ఉత్తమ్…

నల్గొండ జిల్లా..
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశానికి ఎంపీ కెప్టెన్ ఉత్తమ్, MLC ఎంసీ కోటిరెడ్డి హాజరయ్యారు…
మల్లేపల్లి to దేవరకొండ to హాలియా to మిర్యాలగూడ to హుజూర్‌నగర్‌ to కోదాడ వరకు రూ.1000 కోట్లతో జరుగుతున్న రోడ్డు పనులను కేంద్ర ప్రభుత్వం తన చొరవతో మంజూరు చేసిందనన్నారు… కాంగ్రెస్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లతో ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. మహిళా స్వయం సహాయక సంఘాలతో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని స్వయం సహాయక సంఘాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.2000 కోట్లకు పైగా వీఎల్‌ఆర్ (వడ్డీలేని రుణాలు) బకాయిలు ఉండడం దురదృష్టకరం, బాధాకరమన్నారు…
MLC ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతు….. టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాల ప్రజా సంక్షేమం పై దృష్టి సారించి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు..