రాష్ట్రం సురక్షితంగా ఉండాలి అంటే మంచి పార్టీకి ఓటయ్యాలి… సీఎం కేసీఆర్.

నల్గొండ. జిల్లా..

హలియలొ జరిగినా ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతు….
….
ఎన్నికలు వస్తూంటాయి.. పోతాయి..అంతిమంగా ప్రజాస్వామ్యం గెలవాలి.. ఓటు అనేది తల రాతలు మారుస్తుంది..మంచి చెడు ఆలోచన చేసి ఓటయ్యాలి…ఎన్నికల్లో అన్ని పార్టీలు పోటీ చేస్తాయి..అభ్యర్థి ఎవరు ఎలాంటి వారు అనేది ఆలోచన చేయాలి.. పార్టీలు చరిత్ర ఎంది అనేది ఆలోచన చేయాలి…రాష్ట్రం సురక్షితంగా ఉండాలి అంటే మంచి పార్టీకి ఓటయ్యాలి… brs పార్టీ పుట్టినదే తెలంగాణ కోసం, తెలంగాణ హక్కుల కోసం..50 సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్…. మరి ఎం జరిగింది.. మీ తండాల్లో పోయి ఆలోచన చేయాలి…తెలంగాణ వచ్చిన కోత్తలో పరిస్థితి అగమ్యగోచరంగా వుండే… కరంట్ విషయం లో మంచి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న….2 ఏళ్ళలో 24 గంటల కరంట్ ఇవ్వాలని అసెంబ్లీ లో ప్రకటించిన… అప్పుడు
జానారెడ్డి అనే పెద్ద నాయకుడు నాతో ఛాలెంజ్ చేసిండు..24 గంటలు కరంట్ ఇస్తే గులాబీ కండువా వేసుకుంటా అన్నాడు…కరంట్ ఇచ్చి చూపించా.. మరి జానారెడ్డి మాత్రం మాట మీద నిలబడలేదు…మొన్నటి ఉప ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పారు జానారెడ్డి కి….జానారెడ్డి సీఎం అవుతా అని పగటి కలలు కంటున్నాడు…సాగర్ నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాం….నీటి తీరువ బకాయిలను రద్దు చేసినం…
అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో నీటి తిరువ ముక్కు పిండి వసూలు చేసేది…
అన్నదాతలకు 24 గంటలు ఉచిత కరంట్ ఇస్తున్నాం…
ధరణి తెచ్చి అవినీతి ని రూపుమాపినాము…
మేం రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నం. రైతుబంధు ఇస్తున్నం. రైతుబీమా ఇస్తున్నం. కాంగ్రెస్‌ నాయకులేమో నోటికొచ్చింది మాట్లాడుతున్నరు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కేసీఆర్‌కు ఏం పనిలేదు, ప్రజల సొమ్మును రైతుబంధు పేరుతోటి దుబారా చేస్తున్నడు అంటున్నడు..

రైతు బంధు పథకం దుబారా చేస్తున్నారు అని ఉత్తమ్ కుమార్ అంటున్నాడు…రైతు బంధు వుండాలంటే భగత్ గెలవాలి… BRS అభ్యర్థులు గెలిస్తేనే పథకాలు కొనసాగుతాయి… కాంగ్రెస్ PCC అధ్యక్షుడు 3 గంటలు కరంట్ చాలు అంటున్నాడు ..24 గంటలు కరంట్ ఉండాలి అందలంటే BRS గెలవాలి…ధరణి ని రద్దు చేస్తాం అంటున్నారు కాంగ్రెస్ వాళ్లు..ధరణి వద్దు అంటున్న కాంగ్రెస్ వాళ్ళను గంగలో కలపాలి…. రాహుల్ గాంధీ, భట్టి, రేవంత్ సహా అందరూ ధరణి వద్దు అంటున్నారు.. పెద్ద ప్రమాదం పొంచి ఉంది….పెన్షన్ 5 వేలు కావాలంటే BRS గెలవాలి….ఆగమం ఆగమం కావొద్దు…గ్రామాల్లో ఏది నిజమో చెప్పాలి….కాంగ్రెస్ అంటేనే దోపిడీ..
మార్చి తర్వాత అందరికి సన్న బియ్యం ఇస్తాం.. నాగార్జున సాగర్ లో అన్ని పనులు చేస్తాం….పొరపాటున కాంగ్రెస్ వస్తే కరంట్ రాదు.. దళిత బంధు రద్దు చేస్తారు..కాంగ్రెస్ వస్తే వైకుంఠ పాళీ ఆటలో పెద్ద పాము చిన్న పామును మింగినట్టు అవుతాది…గొల్ల కుర్మ లకు గొర్రెలు ఇచ్చింది brs పార్టీ….కాంగ్రెస్ తో పెద్ద ప్రమాదం పొంచి ఉంది… ముఖ్యంగా అన్నదాతలు ఆగం అవుతారు..భగత్ మాంచి యువకుడు.. సేవ చేస్తాడు.. ఉత్సాహం ఉంది.. విద్యావంతుడు… గెలిపించండి…అభివృద్ధి న బాధ్యత…మూడు గంటలు ఇస్తే మూడెకరాలు పారుతది అని చెప్తున్నడు. మరె రైతుల దగ్గర 10 హెచ్‌పీ మోటార్లు ఉంటయా..? ఉండేది 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటార్లు. రాష్ట్రంల మొత్తం 33 లక్షల మోటార్లు ఉన్నయ్‌. మరె 33 లక్షల 10 హెచ్‌పీ మోటార్లు ఎవడు కొనాలె..? వీని అయ్య కొంటడా..? 10 హెచ్‌పీ మోటార్లు గుంజుడు వెడితే బోరు పొక్కలల్ల నీళ్లుంటయా..? అందుకే ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగమై ఓట్లేయొద్దు. మంది మాటలు పట్టుకుని మార్మానం బోతే మళ్లొచ్చేసరికి ఇళ్లు గాల్తది. మేం ఆరు చందమామలు తెస్తం, మేం ఏడు సూర్యుళ్లను తెస్తం అని తియ్యమాటలు చెప్పేటోళ్లను నమ్మి ఓటెయ్యొద్దు’ అని సీఎం సూచించారు…