హనుమాన్ సినిమా రివ్యూ..

తేజా సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు..

సంగీతం : గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్

సినిమాటోగ్రఫీ : శివేంద్ర

ఎడిటర్ : సాయిబాబు తలారి

నిర్మాత : కె. నిరంజన్ రెడ్డి

దర్శకుడు : ప్రశాంత్ వర్మ..
ఈసారి సంక్రాంతి సందడి తెర తీసిన సినిమా హనుమాన్. పేరుకు ఇది చిన్న సినిమా కానీ ప్రేక్షకుల్లో దీనిపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను హనుమాన్ ఎంత మేర అందుకుందో

టాలీవుడ్‌లో సినిమా.. సినిమాకు వైవిధ్యం చూపిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కుర్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈయన ‘జాంబీ రెడ్డి’ తర్వాత ‘హనుమాన్’ (Hanuman) సినిమాతో వచ్చారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదలైంది. ప్రచార చిత్రాలతో ఓ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఎలా ఉంది.. కథేంటీ, కథనం ఎలా సాగింది..

*అమెరికాను వణికిస్తోన్న మంచు….*

*గజగజ వణుకుతున్న ప్రజలు..!*

https://r9telugunews.com/america-weather-heavy/.

కథ విషయానికి వస్తే..

అంజనాద్రి ఓ చిన్న ఊళ్లో అల్లరి చిల్లరగా తిరిగే హనుమంతు (తేజా సజ్జా) అనే కుర్రాడు ఓ యాక్సిడెంట్ కారణంగా నీటిలో పడిపోతాడు. ఈ క్రమంలో అతను హనుమంతుని అనుగ్రహంతో.. కొన్ని సూపర్ పవర్స్ పొందుతాడు. హనుమంతు ఆ సూపర్ పవర్స్‌తో ఏం చేశాడు. ఆ సూపర్ పవర్స్ కారణంగా తనకు వచ్చిన సమస్యలు ఏంటీ.. దీంతో ఆ ఊరికి వచ్చిన కష్టం ఏంటీ.. చివరకు ఈ కష్టాలను, సమస్యలను ఎలా పరిష్కరించాడనేది కథ…

కథనం- విశ్లేషణ:

గత ఏడాది ప్రభాస్ ప్రధాన పాత్రలో ఆదిపురుష్ సినిమా వచ్చింది. హీరోగా ప్రభాస్ స్థాయి ఏంటో చెప్పాల్సిన పనిలేదు. తొలి రోజు థియేటర్లలో రాముడిగా తన పరిచయ సన్నివేశం తెరపై కనిపించినపుడు ఆడిటోరియాలు దద్దరిల్లడం మామూలే. కానీ అదే సినిమాలో ఒక అర గంట గడిచాక మనకు అస్సలు పరిచయం లేని ఓ నటుడు కనిపించినప్పుడు కూడా థియేటర్ అదే స్థాయిలో హోరెత్తిపోయింది. అందుకు కారణం ఆ నటుడు కాదు.. అతను పోషించిన పాత్ర. ఈ క్యారెక్టర్ హనుమంతుడిది అని ఈపాటికి అర్థం అయిపోయి ఉంటుంది. పిల్లలు, పెద్దలు అని తేడా లేదు.. హనుమంతుడు అనగానే ముఖాల్లో చిరునవ్వు పులుముకుంటుంది. ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఆ రూపం.. దాని సమ్మోహన శక్తి అలాంటివి మరి. మన పౌరాణికాల్లో ఆ పాత్రను ఎంతో గొప్పగా వాడుకున్నారు కానీ తర్వాత తర్వాత ఆ పాత్ర కనుమరుగై పోయింది. అయితే హాలీవుడ్ సినిమాలో సూపర్ హీరోలను చూసి గూస్ బంప్స్ తెచ్చుకునే మన ప్రేక్షకులకు.. అంతకు మించి పూనకాలు తెప్పించగల పాత్ర హనుమంతుడిది అని తర్వాతి తరం దర్శకులు ఎవరు గుర్తించలేకపోయారు. అయితే ఇప్పుడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ మర్మాన్ని గుర్తించాడు. హనుమంతుడి పాత్రను అద్భుతంగా వాడుకొని మనదైన సూపర్ హీరో సినిమాను అందించాడు. ఈ పక్కా లోకల్ సూపర్ హీరో సినిమాకు యూనివర్సల్ అప్పీల్ ఉండడం.. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కడం విశేషం. కథ సగటు సూపర్ హీరో సినిమాల తరహాలోనే ఉన్నప్పటికీ.. వినోదాత్మక కథనం, మ్యాజికల్ మూమెంట్స్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి.

ఇండియన్ సినిమాలో సూపర్ హీరో సినిమాలు చాలా తక్కువ. క్రిష్ లాంటి కొన్ని చిత్రాలు మాత్రమే పకడ్బందీగా రూపొంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఆ సినిమా కూడా పూర్తిగా మన నేటివిటీతో కనిపించదు. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల స్ఫూర్తి, అనుకరణ కనిపిస్తుంది అందులో. అయితే స్టాండర్డ్స్ పరంగా అంతర్జాతీయ స్థాయికి దగ్గరగా ఉంటూనే.. పక్కాగా మన నేటివిటీతో సూపర్ హీరో సినిమాగా హనుమాన్ ను చెప్పవచ్చు. అందుకు కారణం హనుమంతుడి చుట్టూ కథను నడపడమే. కొన్ని సినిమాలు ట్రైలర్లో వావ్ అనిపించి.. తెరమీద తుస్సుమనిపిస్తుంటాయి. హనుమాన్ అలాంటి సినిమా కాదు. ట్రైలర్లో వావ్ అనిపించిన మూమెంట్స్.. వాటి చుట్టూ బిల్డ్ చేసిన సన్నివేశాలతో తెరమీద మరింత ఆకర్షణంగా తయారయ్యాయి. ఉదాహరణకు హనుమంతుడి భారీ రూపం.. మనుషుల్ని కొడితే ఎగిరి ఆ భారీ హనుమంటుడి ముందు గాలిలోకి ఎగిరే దృశ్యం.. హీరో హెలికాప్టర్ ను చెట్టు వేరుతో లాగి పడేసే లాంటి సన్నివేశాలు.. పైపై మెరుగులు ఏమి కావు. తెరమీద అవి విజువల్ ట్రీట్ అనిపించేలా.. వాటిని చూస్తూ గూస్ బంప్స్ తెచ్చుకునే డిజైన్ చేసిన విధానం హనుమాన్ మూవీ లో మేజర్ హైలైట్. హనుమంతుడి ప్రస్తావన వచ్చినా.. ఆ రూపాన్ని చూపించినా.. తన ప్రభావం తెరపై కనిపించినా.. ఒక రకమైన ఉద్వేగం తెచ్చుకునేలా ఆయా సన్నివేశాలను దర్శకుడు ప్రశాంత్ వర్మ తీర్చిదిద్దాడు. కొన్ని దశాబ్దాల పాటు ఇలాంటి అద్భుతమైన క్యారెక్టర్ ను ఎందుకు మన దర్శకులు వాడుకోలేదు అని ఆశ్చర్యపోయేలా చేశాడు ప్రశాంత్…హనుమాన్ లో ముందుగా విలన్ని పరిచయం చేశాక.. ఆరంభ సన్నివేశాల్లోనే హనుమంతుడి భారీ రూపాన్ని.. దాని చుట్టూ ఒక అందమైన ప్రపంచాన్ని చూపించి ప్రేక్షకులకు మంచి మూడ్ సెట్ చేస్తాడు ప్రశాంత్ వర్మ. తర్వాత హీరో పరిచయ సన్నివేశాలు.. అంజనాద్రి గ్రామంలో వ్యవహారాలతో కథనం కొంచెం నెమ్మదిస్తుంది. కానీ మరి ఆలస్యం చేయకుండా కథను మలుపు తిప్పేశాడు దర్శకుడు. హీరో హనుమంతుడి తాలూకు అద్భుత శక్తిని చేజిక్కించుకున్నాక వచ్చే ఫాంటసీ సన్నివేశాలు మంచి వినోదం పంచుతాయి. ఇక్కడి నుంచి కథనం చకచకా సాగిపోతుంది. హీరో తన శక్తిని చూపించే యాక్షన్ ఘట్టాలు గమ్మత్తుగా అనిపిస్తాయి. విజువల్ ట్రీట్ అనిపించేలా తీర్చిదిద్దిన ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా మంచి కిక్ ఇస్తుంది.

మంచి మలుపులతో, వినోదంతో, విజువల్ మాయాజాలంతో ఆకట్టుకునే ప్రథమార్ధం తర్వాత ద్వితీయార్ధం మీద మీద చాలా అంచనాలు పెట్టుకుంటాం. కానీ ఆ అంచనాలకు తగ్గట్లు రెండో అర్ధం సాగదు. విలన్ పాత్ర కొంచెం గజిబిజిగా సాగడం.. హీరో అక్క పాత్రతో బలవంతపు ఎమోషనల్ డ్రామాను నడిపించడం.. కొన్ని రొటీన్ సన్నివేశాలు సినిమా గ్రాఫ్ ను కొంచెం తగ్గిస్తాయి. కానీ సినిమా పూర్తిగా బోర్ కొట్టే పరిస్థితి అయితే ఉండదు. మధ్య మధ్యలో మెరుపులు వచ్చి ప్రేక్షకుల ఉత్సాహాన్ని నిలబెడతాయి. చివరి అరగంటలో హనుమాన్ మళ్లీ పతాక స్థాయిని అందుకుంటుంది. హనుమాన్ పాత్ర గొప్పతనాన్ని చాటుతూ.. దాని ప్రభావంతో సాగే క్లైమాక్స్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను మరో లోకంలో విహరింపచేస్తాయి. అంతకుముందు ఉన్న కొంత అసంతృప్తిని క్లైమాక్స్ భర్తీ చేస్తుంది. పతాక సన్నివేశాల్లో భారీతనానికి ఆశ్చర్యపోతాం. మనం చూస్తున్నది ఒక చిన్న సినిమా అన్న భావనే ఏ కోశానా కలగదు. ఒక విజువల్ వండర్ చూసిన అనుభూతితో ప్రేక్షకుల కడుపు నింపి పంపిస్తుంది హనుమాన్. పిల్లలకు మరింతగా నచ్చే ఈ సినిమా పెద్దలనూ సంతృప్తి పరుస్తుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి నేటివ్ సూపర్ హీరో సినిమా హనుమాన్..
నటీనటుల విషయానికి వస్తే..

తేజ సజ్జా తన నటనతో అదరగొట్టాడు. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన యాక్టింగ్‌తో వావ్ అనిపించింది. ఇక ఈ సినిమాలో హనుమాన్ పాత్ర ఇంకా కొంచెం ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, సత్య కామెడీలు అదిరిపోయాయి. విలన్ పాత్రలో వినయ్ రాయ్‌కు కేక పెట్టించాడు. హీరోయిన్ అమృత అయ్యర్ ఓకే అనపించింది. ఇక చివరగా ప్రశాంత్ వర్మ తనకున్న లిమిటెడ్ బడ్జెట్ లో సినిమా క్వాలిటీని ఎక్కడ తగ్గకుండా భారీ లెవెల్ లో చూపించాడు.

ఫ్లస్ పాయింట్స్..

కథ, కథనం..

గ్రాఫిక్స్..

మైనస్ పాయింట్స్..

ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ ల్యాగింగ్…