హనుమాన్ మూవీ లొ శ్రీ రాముడి పాత్ర రామ్ చరణ్..

చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ దుమ్ము దులిపేస్తున్న ‘హనుమాన్’ చిత్రం రీసెంట్ గానే వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని దాటి 200 కోట్ల రూపాయిల గ్రాస్ వైపు పరుగులు తీస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే…ఈ సినిమాకి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ అనే చిత్రం తెరకెక్కిస్తానని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇది వరకే పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. ఈ సినిమా లో హీరో తేజ సజ్జ కాదని, ఈ చిత్రం మొత్తం హనుమంతుడి పాత్ర చుట్టూనే తిరుగుతుందని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. ‘హనుమాన్’ క్లైమాక్స్ లో శ్రీ రాముడికి హనుమంతుడు ఒక ప్రమాణం చేస్తాడు. ఆ ప్రమాణం గురించి సినిమా మొత్తం ఉంటుందట.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘హనుమాన్‌’ మూవీ పేరు మారుమోగుతుంది. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ, కుర్ర హీరో తేజ సజ్జ కాంబినేషన్‌లో వచ్చిన ఈసినిమా ఊహించని విజయం సాధించింది. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేస్తూ విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. పాన్‌ ఇండియాగా పదుకొండు భాషల్లో విడులైన ‘హనుమాన్‌’ సంచలన విజయం అందుకుంది. అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తక్కువ బడ్జెట్‌లోనే విజువల్‌ వండర్‌ చూపించిన ప్రశాంత్‌ వర్మ పనితనాన్ని కొనియాడుతున్నారు. సూపర్‌ మ్యాన్‌ జానర్‌కు హనుమాన్‌ సెంటిమెంట్‌ జోడించి తెలుగు ఆడియన్స్‌కి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చాడు. ఇక తేజ సజ్జ యాక్టింగ్‌ ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ‘హనుమాన్‌’లో ప్రశాంత్‌ వర్మ టేకింగ్‌ నెక్ట్‌ లెవల్‌ అంటున్నారు. ఇలా ఊహించని బజ్‌తో ఇప్పటికే బాక్సాఫీసు వద్ద అదే జోరు కనబరుస్తోంది..

‘హనుమంతుడి’ పాత్ర ఎవరు చేస్తారో తెలీదు కానీ, శ్రీ రాముడి పాత్ర మాత్రం రామ్ చరణ్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ప్రస్తుతం ఉన్న హీరోలలో శ్రీ రాముడి పాత్ర కి ఇమిడిపోయేది కేవలం రామ్ చరణ్, ప్రభాస్ మాత్రమే. ప్రభాస్ ఇప్పటికే చేసేసాడు కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ వంతు వచ్చింది. ఆయన అభిమానులను శ్రీ రాముడిగా ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి..