సినిమాపై కొంతమంది నెగిటివ్ గా పోస్టులు చేస్తున్నారు..

సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ నుంచి హనుమాన్ టీం గురించి ఇష్టమొచ్చినట్టు పోస్ట్ చేస్తున్నారు..

తాజాగా సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకోవడంతో పాటు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.

అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా మేనియానే ఎక్కువగా కనిపిస్తోంది.హనుమాన్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా నచ్చేసింది…

సంక్రాంతికి వచ్చిన హనుమాన్(Hanuman) సినిమా థియేటర్స్ లో దుమ్ము దులిపేస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు హనుమాన్ సినిమా బాగా నచ్చేసింది. రిలీజ్ కి ముందు థియేటర్ల ఇబ్బందులు, బడ్జెట్ ప్రాబ్లమ్స్.. ఇలా చాలా కష్టాలు పడి మూడేళ్ళ పాటు సినిమాని చేసి రిలీజ్ చేశారు. ఆ కష్టానికి ప్రతిఫలం వచ్చి కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లో వస్తున్నాయి. అయితే రిలీజ్ కి ముందు థియేటర్స్ విషయంలో చాలా ఇబ్బందులు చూసింది హనుమాన్ టీం. తర్వాత హనుమాన్ భారీ సక్సెస్ అవుతుండటంతో కొంతమంది కావాలని సినిమాపై, సినిమా టీంపై నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ నుంచి హనుమాన్ టీం గురించి ఇష్టమొచ్చినట్టు పోస్ట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ప్రశాంత్ వర్మ పేరుతోనే ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. చరణ్ నన్ను డిన్నర్ కి పిలిచి నాతో సినిమా చేయమని అడిగాడు, నేను నో చెప్పాను అంటూ ఫేక్ న్యూస్ పోస్ట్ చేశారు. ఇలా డైరెక్టర్, సినిమాపై కొంతమంది నెగిటివ్ గా పోస్టులు చేస్తున్నారు..