కాంగ్రెస్ పార్టీలో చేరనున్న మైనంపల్లి హన్మంతరావు, రోహిత్..!!

ఢిల్లీ చేరుకున్న మైనంపల్లి హన్మంతరావు, మైనంపల్లి రోహిత్..

బీఆర్‌ఎస్‌ పార్టీకి మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. మైనంపల్లి హన్మంతరావు, మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే… నిన్న రాత్రి మైనంపల్లి హన్మంతరావు, మైనంపల్లి రోహిత్ ఢిల్లీ చేరుకోవడం జరిగింది…

రేపు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న మైనంపల్లి హన్మంతరావు, రోహిత్..

భారత రాష్ట్ర సమితి పార్టీకి మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు.

గత కొన్ని రోజులుగా భారత రాష్ట్ర సమితి పార్టీకి దూరంగా ఉంటున్న మైనంపల్లి హనుమంతరావు… ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. తాను భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేస్తున్నానని… కార్యకర్తలు మరియు సన్నిహితుల సూచన మేరకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు మైనంపల్లి హనుమంతరావు.

తన భవిష్యత్తు తేల్చుకునేందుకు డిల్లీ వెళ్ళిన షర్మిల. రేపు కాంగ్రెస్ పెద్దల్ని కలవనున్న షర్మిల.