కాంగ్రెస్ పని కేల్ ఖతం… దుకాణం బంద్…. హరీష్ రావు.

*కాంగ్రెస్ పని కేల్ ఖతం… దుకాణం బంద్…. హరీష్ రావు* …

ఉమ్మడి నల్గొండ జిల్లా లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన….

పలు మార్కెట్ యార్లలో వడ్లని తనిఖీ చేసి రైతులతో మాట్లాడిన హరీష్ రావు…

ఉత్తమ్ ఉత్త మాటలే….

వడ్ల కుప్పల మీదే రైతులు ప్రాణాలు విడుస్తున్నా సీఎం రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదు.

ఏసీ రూముల్లో కూర్చుని అబద్ధాలు చెప్పే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. చౌటుప్పల్ మార్కెట్‌కు వచ్చి రైతుల గోస వినాలి.

*రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే.. ఢిల్లీకి నజరానా, రైతులకేమో జరిమానా అన్నట్టుగా తయారైంది.

*తరుగు పెడితే తోలు తీస్తా అన్న ముఖ్యమంత్రి.. ఇప్పుడు బస్తాకు 3 కిలోల కోత పెడుతుంటే ఏంచేస్తున్నాడు?*

*ధాన్యం కొనుగోళ్లు గాలికి వదిలేసి, యూరియా అమ్మకాలపై నిషేధం పెట్టి ‘రైతు వారోత్సవాలు’ చేయడం సిగ్గుచేటు.*

*చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీశ్ రావు*

*వడ్ల కుప్పల వద్దనే రోజుల తరబడి రైతుల నిరీక్షణ, ఆవేదనను స్వయంగా అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి.*
…………………………………………………..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు సందర్శించారు. నెల రోజులైనా వడ్లు కొనడం లేదని, తరుగు పేరుతో దోచుకుంటున్నారని రైతులు ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కల్లాల్లో తడిసిన వడ్ల కుప్పలను పరిశీలించిన హరీశ్ రావు, రైతులకు ధైర్యం చెప్పారు. అకాల వర్షాలకు గుండెలు అరచేతిలో పెట్టుకుని పడిగాపులు కాస్తున్న రైతుల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.

మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ……

రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. వడ్ల కుప్పల వద్దనే రైతుల గుండెలు ఆగిపోతున్నా, సీఎం రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదు.

కేసీఆర్ ప్రభుత్వంలో వడ్ల కొనుగోళ్లలో ఏనాడూ ఇంతటి దారుణ పరిస్థితులు లేవు.

కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా, రైతుబంధు, సాగునీరు, కరెంటు, చివరికి పండిన పంట అమ్ముకునే దాకా అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయి.

జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మేం చాలా బాగా వడ్లు కొంటున్నాం, ఎవరికీ ఇబ్బంది లేదు అని గొప్పలు చెప్పారు.

అయ్యా ఉత్తమ్.. నేను ఏసీ రూమ్ లో కూర్చుని మాట్లాడటం లేదు. నీ జిల్లాలోని చౌటుప్పల్ మార్కెట్లో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నా.

ఈ తల్లీ, ఈ చెల్లెలు వడ్లు మార్కెట్ కు తెచ్చి 24 రోజులైంది. 30వ తేదీన మాయిశ్చర్ చూసి పాస్ అన్నాక కూడా 8 రోజులుగా కాంటా పెట్టే దిక్కే లేదు.

44 డిగ్రీల ఎండలో రైతులు నెల రోజులుగా పడిగాపులు కాస్తూ, పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఇది పూర్తిగా మీ ప్రభుత్వ చేతగానితనమే.

మాయిశ్చర్ చూడటానికి పది రోజులు, సంచులివ్వడానికి వారం, కాంటాకు వారం, మిల్లుకు వెళ్లడానికి మరో వారం పడుతోంది.

తీరా మిల్లుకు వెళ్లాక తాలు ఉందని చెప్పి లారీకి 4, 5 బస్తాలు కటింగ్ పెడుతున్నారు. అటు మార్కెట్లో తరుగు, ఇటు మిల్లులో కోత.. అసలు మీకు వడ్లు కొనడం చేతవుతోందా?

ఉత్తమ్ కుమార్ రెడ్డి గారూ.. గల్లీలకు వచ్చి రైతుల గోస వినండి. మీ రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే.. ఢిల్లీకి నజరానా, రైతులకేమో జరిమానా అన్నట్టుగా తయారైంది.

69 సార్లు ఢిల్లీకి పోయి కప్పం కట్టే బదులు రైతులను పట్టించుకోండయ్యా..

తరుగు పెడితే తోలు తీస్తా అన్న సీఎం.. ఇప్పుడు ఎవరి తోలు తీస్తాడో చెప్పాలి. ప్రతి బస్తాకు 2-3 కిలోల తరుగు తీస్తుంటే ఏం చేస్తున్నారు?

మంచిర్యాలలో అకాల వర్షాలకు గోడ కూలి వడ్ల కుప్పల వద్ద ముగ్గురు రైతులు, కొడుకు చనిపోయారు.

నల్గొండ జిల్లాలో వడ్ల కుప్పల మీదనే రైతు గుండె ఆగి చనిపోయాడు. ఇంకెంత మంది బలైతే మీకు సోయి వస్తుంది?

బీఆర్ఎస్ హయాంలో మేము 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాము. మీరు కొనడం చేతగాక అబద్ధాలు చెబుతున్నారు.

నేను మార్కెట్ కు వస్తున్నానని తెలిసి ఈరోజు 4, 5 లారీలు పంపించారు.. మేమొస్తే తప్ప మీరు లారీలు పంపరా..

రైతు భరోసా వారోత్సవాలు అని సిగ్గులేకుండా సంబరాలు చేస్తున్నారు. ఎకరాకు చొప్పున విడతల వారీగా విదిలిస్తూ సంబరాలు ఏ మొహం పెట్టుకుని చేస్తున్నారు?

రైతుబంధు, యూరియా, రుణమాఫీ, కొనుగోళ్లు అన్నీ ఎగ్గొట్టినందుకు చేస్తున్నారా ఈ వారోత్సవాలు?

రాష్ట్ర, దేశ చరిత్రలో యూరియా అమ్మకాలపై నిషేధం విధించిన ఏకైక ఘనత రేవంత్ రెడ్డి సర్కార్ దే.

కూరగాయలు, ఆయిల్ పామ్ పండించే రైతులకు యూరియా అమ్మొద్దని బోర్డులు పెట్టడం మీ ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనం.

మొక్కజొన్నలు, సన్ ఫ్లవర్ కొని నెలలు దాటుతున్నా రైతులకు ఒక్క రూపాయి వేయలేదు.

జొన్నలు, శనగలు కొననే లేదు. కానీ 48 గంటల్లో పైసలు వేస్తున్నామని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు.

కేసీఆర్ గారు కరెంటు, సాగునీరు, రైతుబంధు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేశారు. కానీ మీరు ధాన్యం కొనకుండా జాప్యం చేసి, రైతులు దళారులకు అగ్గువకు అమ్ముకునేలా కుట్ర చేస్తున్నారు.

వాతావరణ శాఖ అకాల వర్షాలు, తుఫాను హెచ్చరికలు జారీ చేస్తోంది. వర్షం వస్తే చౌటుప్పల్ మార్కెట్ అంతా నీట మునిగి వడ్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు.

ప్రభుత్వం తక్షణమే మేల్కొని మార్కెట్లకు సరిపడా లారీలు, గన్నీ బ్యాగులు పంపాలి. మిల్లర్లకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసి యుద్ధప్రాతిపదికన వడ్లు కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం…. కసాయి కాంగ్రెస్ పోవాలి… కనికరం ఉన్న kcr (కేసీఆర్) పాలన కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు…
కరోనా సమయంలో వడ్లు కొనుగోలు ఆగకుండా చేసేరు అన్నారు..
సూర్యపేట జిల్లా.. కోదాడ లో BRS నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం..,, ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి, సిద్దిపేట mla హరీష్ రావు..పాల్గొన్న .కోదాడ మాజీ mla మల్లయ్య యాదవ్,మాజీ mla లు. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. చిరుమర్తి లింగయ్య ..భగత్ యాదవ్,మాజీ mp లింగయ్య యాదవ్..,మాజీ zp చైర్మన్ నరేందర్ రెడ్డి,,,మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు ఎర్రోళ్ల శ్రీనివాస్, పల్లె రవికుమార్.,రాకేష్ రెడ్డి.కర్నాటి విద్యాసాగర్…