ప్రజల తీర్పును శిర‌సావ‌హిస్తాం.ఎన్నిక‌ల్లో తెరాసకు ఓటేసిన వారందరికీ కృతజ్ఞతలు.. హరీష్ రావు.

హరీశ్వర్ రావు.

‘‘ప్రజల తీర్పును శిర‌సావ‌హిస్తాం. ఎన్నిక‌ల్లో తెరాసకు ఓటేసిన వారందరికీ కృతజ్ఞతలు. పార్టీ కోసం క‌ష్టపడిన కార్యకర్తలకు ధన్యవాదాలు. తెరాసకు ఓట్లేమీ తగ్గలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌, భాజపా కలిసి పనిచేశాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కూడా చెప్తున్నారు. జాతీయ స్థాయిలో కొట్లాడే రెండు పార్టీలు కుమ్మక్కు కావడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఏది ఏమైనా ఒక్క ఎన్నికలో ఓటమితో తెరాస కుంగిపోదు. గెలిచిన నాడూ పొంగిపోలేదు. ఎప్పుడూ ప్రజల పక్షానే ఉండి పనిచేస్తుంది.’’..