హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఈటెల రాజేంద్ర..

హుజురాబాద్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన తరువాత ఈటల రాజేందర్‌ మొదటి సారిగా హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో మార్గమధ్యంలో సిద్ధిపేటలోని రంగదాంపల్లి చౌరస్తాలో ఆగారు. అక్కడ ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు. చేశారు.
రానున్న రోజులన్నీ హరీష్ రావు కి ఇబ్బంది కరంగానే ఉంటాయని…
రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా హరీశ్‌రావు వచ్చి సిద్ధిపేటలా అభివృద్ధి చేస్తానంటూ ఆ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కానీ.. హుజురాబాద్‌ ప్రజలు హరీశ్‌రావుకి తగిన బుద్ది చెప్పారని విమర్శించారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో నిలిపివేసిన దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.