కాంగ్రెస్‌ విధానాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు..హరీశ్‌రావు.

విద్యుత్ విష‌యంలో కేసీఆర్‌ను విమ‌ర్శిస్తే.. సూర్యుడి మీద ఉమ్మేసిన‌ట్టే.. కాంగ్రెస్‌పై హ‌రీశ్‌రావు ధ్వ‌జం..

HarishRao on Congress : ‘కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెప్తారు’

HarishRao Comments on Congress కాంగ్రెస్‌ విధానాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్‌ వద్దని అన్నవాళ్లకు ప్రజలు రాజకీయంగా సమాధి కట్టారని.. కాంగ్రెస్‌కు కూడా తెలంగాణ ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అని చెప్తున్న యూపీ, మహారాష్ట్రలో ఆయిల్‌ ఇంజిన్లు ఉన్నాయని హరీశ్‌రావు విమర్శించారు…విద్యుత్ విష‌యంలో కేసీఆర్‌ను విమ‌ర్శిస్తే.. సూర్యుడి మీద ఉమ్మేసిన‌ట్టే.. కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు..రైతుల ప‌ట్ల కాంగ్రెస్ పార్టీ నిజ‌స్వ‌రూపం ఏంటో ఇవాళ తెలిసిపోయింద‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. రేవంత్ రెడ్డి 3 గంట‌ల క‌రెంట్ చాలు అంటారు. ఉచిత కరెంట్‌కు సోనియాగాంధీ వ్య‌తిరేక‌మ‌ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి సుజాత చెప్తారు. రైతుల‌కు 8 గంట‌ల క‌రెంట్ చాల‌ని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే బోరుబావుల వ‌ద్ద మీట‌ర్లు పెడుతామ‌ని మ‌రో అధికార ప్ర‌తినిధి అద్దంకి ద‌యాక‌ర్ మాట్లాడుతారు అని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.