హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఈరోజు రాజీనామా.!!

*హర్యానా సీఎం రాజీనామా?*

హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఈరోజు రాజీనామా చేశారు.

గవర్నర్ కు తన రాజీనామా లేఖను ఆయన సమర్పిం చారు.ఈరోజు మధ్యాహ్నాం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

జేజేపీ, బీజేపీ కూటమిలో విబేధాలు నెలకొన్నాయి. దీంతో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

కాసేపట్లో బీజేఎల్పీ సమావేశంలో కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు…

హర్యానాలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్(Manohar Lal Khattar) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయతో భేటీ అనంతరం ఆయన రాజీనామా చేశారు. ఆయన ప్రభావంతో ఆయన కేబినెట్ మంత్రులు కూడా రాజీనామా చేశారు. శాసన సభ రాష్ట్ర ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని ప్రభుత్వ భాగస్వామి జేజేపీ మధ్య విభేదాలు తలెత్తడమే ఈ పరిస్థితికి కారణం. అయితే గత కొద్ది రోజులుగా కూటమిలో చీలికలు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పరిణామం మొదలైంది..కాగా, హర్యానా అసెంబ్లీ 90 స్థానాలు ఉండగా, అందులో 40 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. భారతీయ జనతా పార్టీ స్వతంత్ర ఎమ్మెల్యేలతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే…