హర్యానా ముఖ్యమంత్రి గా నయాబ్ సింగ్ సైనీ..

హర్యానా అసెంబ్లీలో కొత్త ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ బల పరీక్షలో తన బలం నిరూపించుకున్నారు. మూజువాణి ఓటుతో కొత్త ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది.

మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ రాజీనామాతో హర్యానాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత నాయబ్ సైనీ ముఖ్య మంత్రిగా బాధ్య‌త‌ లు చేపట్టారు.

రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల లేఖను ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

నేడు ప్ర‌త్యేకంగా స‌మావే శ‌మైన అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష ను ఎదుర్కొన్నారు…