పసుపు పాలతో అనేక ప్రయోజనాలు….

పసుపు పాలతో..పొట్ట కొవ్వుకరగడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు!..
ప‌సుపు ఇది ఉంటే చాలు మనం ఏ వ్యాధినైనా ఇట్టే ఎదుర్కొవొచ్చు. వంటింట్లో మ‌నం నిత్యం ఉప‌యోగించే ప‌దార్థం ప‌సుపు. దీంట్లో అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ప‌సుపును నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. పసపు చేసే మేలు అంతా ఇంతకాదు. బరువు తగ్గాలన్నా పసుపు అవసరమే…….రోజూ తినే ఆహారంలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. ‘లో డెన్సిటీ లిపొప్రొటైన్ (ఎల్.డి.ఎల్)’ అనే చెడు కొలెస్ట్రాల్ ను పసుపు త‌గ్గిస్తుంది. ఇది కొవ్వును క‌రిగించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంతోపాటు రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది…….
స్థూల‌కాయ‌ం, శ‌రీరంలో అధికంగా పేరుకుపోయే కొవ్వు తో నేడు చాలా మంది స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అయితే పసుపు ద్వారా ఆ సమస్య నుంచి బయటపడొచ్చు…

పసుపు పాలతో అనేక ప్రయోజనాలు
పసుపు పాలతో తయారు చేసిన మిశ్రమంతో బరువు తగ్గడమేకాకుండా అనేక ప్రయోజనాలున్నాయి. దగ్గు, జలుబు ఉపశమనానికి, తలనొప్పి తగ్గడానికి, కంటి నిండా నిద్ర కోసం, రుతుక్రమం సమస్యల పరిష్కానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఒక గ్లాసు పాలలో టీ స్పూన్ చక్కెర, చిటికెడు పసుపు కలిపి 10 – 15 నిమిషాల పాటు మరిగించాలి. కొంత సేపటి తర్వాత పాలు గోరు వెచ్చగా అయ్యాక తాగాలి. పసుపు పాల ఫలితం సంపూర్తిగా పొందాలంటే ప్రతి రోజూ క్రమం తప్పక తాగాలి. పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది…