డి విటమిన్ లోపం వల్ల ఏర్పడే సమస్యలు…వాటి పరిష్కారాలు….

ఈ మధ్యకాలంలో అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి.
అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి.
శరీరానికి దీనికి గల కారణం ఏమిటంటే సరైన ఆహార అలవాట్లు లేక పోవడం. పోషక విలువలు లేక పోవడం వలన ఎన్నో సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రోగ నిరోధక శక్తి కి అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినిరల్స్ తప్పక తీసుకోవాలి. అప్పుడే అనారోగ్య సమస్యలు వ్యాపించవు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా తీసుకునే ఆహారం పై శ్రద్ధ పెట్టాలి. అన్ని రకాల విటమిన్స్ మరియు మినరల్స్ అందేలా చూసుకోవాలి. అయితే ముఖ్యంగా విటమిన్ డి చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. న్యూట్రిషన్, డైటీషియన్ మరియు కార్పొరేట్ హెల్త్ ఎడ్యుకేటర్ మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు. వీటిని చూసి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దీనితో సమస్య నుండి బయట పడవచ్చు. విటమిన్-డి అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యమైన మైక్రో న్యూట్రియెంట్. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలానే ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది కూడా. ..

మానవ శరీరంలో డి విటమిన్ లోపిస్తే.. అనారోగ్యాల బారిన ఎక్కువ పడే అవకాశం ఉంటుంది..

డి విటమిన్ లోపించడం వల్ల పిల్లలకు అనారోగ్యాలు ఎదురవుతుంటాయి..

ఎదిగే పిల్లలకు చాలా అవసరం కూడా..

డి విటమిన్ లోపించడం వల్ల ఎదురయ్యే సమస్యలు..

డి విటమిన్ లోపించడం వల్ల ఎముకలు బలహీనత కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు.. వస్తుంటాయి.. అంతేకాకుండా గుండె కూడా అంత దృఢంగా పనిచేయదు..
రక్తపోటు సమస్యకు కారణం అవుతుంది…
డి విటమిన్ లోపం ఉన్నవారు మధుమేహం వచ్చే సమస్య కూడా ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు షుగర్ మరింత పెరిగే అవకాశం ఉందని రక్తపోటు వంటి సమస్యలు కూడా డి విటమిన్ లోపం వల్లే వస్తున్నాయని తెలిపారు..

కాళ్లు, చేతులు లాగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. నడుం మొత్తం కూడా పట్టేస్తూ ఉంటుంది. దీంతో చాలా ఇబ్బందిపడుతుంటారు. ఇలాంటి సమస్య ఎక్కువగా మహిళల్లో ఉంటుంది. అయితే ఇది డి విటమిన్ లోపం వల్లే వస్తుంది. దీంతో బాగా నీరసానికి గురవుతారు.కేవలం మహిళల్లలోనే కాకుండా పురుషుల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అయితే యవ్వనంలో దీన్ని నిర్లక్ష్యం చేస్తే వృద్ధాప్యంలో చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది.డి విటమిన్ లోపం అంటూ ఉంటాం. కానీ అసలు అది ఏర్పడడానికి కారణం చాలా మందికి తెలియదు.ప్రతి వ్యక్తి శరీరంలో కోలి కాల్సి ఫెరాల్‌ అనే ఆసిడ్ ఒకటి ఉంటుంది. అది లోపిస్తే చాలా సమస్యల బారినపడతాం. విటమిన్ డి. దీన్నే సన్‌షైన్ విటమిన్ అని అంటారు. సూర్యకాంతిలో రోజూ కొంత సేపు ఉంటే ఈ విటమిన్ మనకు లభిస్తుంది. శారీరక దారుఢ్యం ఉండాలన్నా, ఎముకలు పటిష్టంగా మారాలన్నా విటమిన్ డి మనకు అవసరం. దీంతోపాటు పలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా నిత్యం మనకు తగిన మోతాదులో విటమిన్ డి అవసరం.

విటమిన్ డి మనకు సూర్యకాంతి వల్లే కాదు, పలు ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా లభిస్తుంది. చేపలు, బీఫ్ లివర్, చీజ్, కోడిగుడ్లు, కాడ్ లివర్ ఆయిల్, పాలు, పుట్టగొడుగులు తదితర ఆహారాలను తింటే విటమిన్ డి లభిస్తుంది. అయితే విటమిన్ డి లోపిస్తే మాత్రం పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.విటమిన్ డి లోపం వల్ల తీవ్రమైన అలసట, బలహీనత, ఎముకల్లో నొప్పి, బలహీనమైన కండరాలు, ఆలోచనా శక్తి తగ్గిపోవడం, తరచుగా ఎముకలు విరగడం, పగుళ్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి..