శరీరంలో ఈ మార్పులు కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నట్లు సూచనలు..!!!

శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కిడ్నీలది కీలకపాత్ర. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా మూత్రపిండాలు ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతాయి. బీపీ, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. అయితే మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించినా వెన్నునొప్పి, కడుపు నొప్పి సమస్యలు వేధించినా, చేతులు కాళ్లలో కిడ్నీ సమస్యల వల్ల వాపు మొదలైనా గోర్లు బలహీనంగా మారి గోర్లపై తెల్లని మచ్చలు ఉన్నా కిడ్నీ వ్యాధి అయ్యే ఛాన్స్ ఉంటుంది…

వ్యాయామంతో చెక్ పెట్టొచ్చు..

వ్యాయామం మాత్రం తప్పనిసరిగా చేస్తే శరీరానికి సరిపడినంత దొరుకుతుంది…
చర్మాన్ని దురద సంబంధిత సమస్యలు వేధిస్తున్నా చర్మం తరచూ పొడిబారుతున్నా కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. విటమిన్లు, ఖనిజాల లోపం వల్ల కూడా కొన్నిసార్లు కిడ్నీ సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర తప్పనిసరిగా ఉండాలి. ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. ప్రతిరోజూ అరగంట సమయం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కూడా కిడ్నీ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు…

మద్యానికి, ధూమపానానికి దూరంగా ఉండాలి..

ధూమపానం, ఆల్కహాల్ కు దూరంగా ఉండటం ద్వారా కూడా కిడ్నీ సంబంధిత సమస్యలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచుకోవడం ద్వారా కూడా కిడ్నీ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. బ్లడ్ షుగర్ ను నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా కూడా షుగర్ లెవెల్స్ అదుపులో ఉండే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మధుమేహంతో బాధ పడేవాళ్లను కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య వేధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. శరీరానికి అవసరమైనంత నీళ్లు తాగడం ద్వారా కిడ్నీ సంబంధిత సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.