మంత్రి హ‌రీశ్ రావుకు వైద్యారోగ్య‌ శాఖ అద‌న‌పు బాధ్య‌త‌లు..

మంత్రి హ‌రీశ్ రావుకు వైద్యారోగ్య‌ శాఖ
అద‌న‌పు బాధ్య‌త‌లు..

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్ రావుకు అద‌నంగా వైద్యారోగ్య‌ శాఖ అప్ప‌గిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు హ‌రీశ్ రావు ఆర్థిక శాఖ‌ను మాత్ర‌మే ప‌ర్య‌వేక్షించేవారు. ఇక నుంచి రెండు శాఖ‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తార‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌లో పేర్కొంది. ప్ర‌స్తుతం ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ వ‌ద్దే ఉంది.

ఈట‌ల రాజేంద‌ర్‌ను మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన అనంత‌రం సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఆరోగ్య శాఖ‌పై హ‌రీశ్‌రావు స‌మీక్ష‌లు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. కొవిడ్ నివార‌ణ చ‌ర్య‌ల‌పై హ‌రీశ్‌రావు ఎప్ప‌టిక‌ప్పుడు సీఎస్ సోమేశ్ కుమార్‌, ఆరోగ్య శాఖ అధికారుల‌తో స‌మీక్షించి, ప‌లు సూచ‌న‌లు చేశారు.