సరిపడా నిద్ర….నిద్ర లేకపోతే ఎంత ప్రమాదమో తెలుసా?

మనందరం బాగా కష్టపడతాం. కానీ సరిగా నిద్రపోం. నిజానికి రాత్రి 8 గంటలకే పడుకొని… ఉదయం 4 గంటలకు లేవడం సరైన పద్ధతి. కానీ… ఈ రోజుల్లో చాలా మంది రాత్రి 12కి పడుకొని… తెల్లారి 6 గంటలకల్లా లేచిపోతున్నారు. రోజూ అదే సమయం కాకుండా వేర్వేరు టైమ్స్‌లో పడుకుంటున్నారు. ఇవన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రోజుకు కనీసం 7 గంటలు పడుకోవాలి. 8 గంటలు పడుకుంటే ఇంకా బెటర్. నిద్ర సరిగా లేకపోతే బుర్ర హీటెక్కిపోతుంది. మతిమరపు మొదలవుతుంది. ఇర్రిటేషన్ వస్తుంది. బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి, షుగర్ వ్యాధి వస్తుంది. హార్మోన్లు దెబ్బతిని అడ్డమైన రోగాలూ వస్తాయి. అన్నింటికీ చెక్ పెట్టాలంటే చక్కగా నిద్రపోవాలి…స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలామంది టీవీలు కంటే ఎక్కువగా మొబైళ్లనే ఎక్కువ చూస్తున్నారు. చేతిలో ఇమిడిపోయే ఈ మినీ తెరలో ఓటీటీలు, యూట్యూబ్ వీడియోలను చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. అయితే, కొంతమంది రాత్రిళ్లు నిద్రలు మానుకొని మరీ వీటిని చూస్తున్నారు. తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల రెండు రకాల ప్రమాదాలు పొంచివున్నాయి. ఒకటి మొబైల్ లైటింగ్ వల్ల కళ్లు, రేడియేషన్ వల్ల మెదడు దెబ్బతింటాయి. రెండోది.. నిద్రలేమి వల్ల కొత్త వ్యాధులు శరీరంపై దాడి చేస్తాయి….రోజుకు మనిషి కనీసం 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. వయోవృద్ధులు, పిల్లలు రోజుకు తప్పనిసరిగా 10 గంటలు నిద్రపోవాలి. కనీసం 6 గంటలైనా నిద్ర లేకపోతే మనం చేతులారా ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నట్లే. నిద్రలేకపోతే ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయో చూడండి.