నెయ్యి తింటే లావుగా అవుతారా ఇది నిజమేనా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిదా.. కాదా ?..

నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది.
R9TELUGUNEWS.COM.
నెయ్యి తిన‌డం ఆరోగ్యానికి మంచిది కాద‌ని, నెయ్యి తింటే శ‌రీరంలో కొవ్వు పేరుకుపోతుంద‌ని, లావుగా మార‌తార‌నే, నెయ్యి త్వ‌ర‌గా అర‌గ‌ద‌ని చాలా ప్ర‌చారాలు ఉన్నాయి. నిజానికి ఇవి అపోహ‌లు మాత్ర‌మే అని వైద్యులు చెబుతున్నారు. నెయ్యి తింటే ఆరోగ్యానికి మంచిద‌ని వైద్యులు చెబుతున్నారు. నెయ్యిలో మ‌న శ‌రీరానికి మంచి చేసే అనేక గుణాలు ఉన్నాయి…

R9TELUGUNEWS.COM.
నెయ్యి వల్ల హెల్తీ ఫ్యాట్స్ పెరుగుతాయి అంటే గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే నెయ్యిని తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గడానికి సహాయపడుతుంది. నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. అలాగే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ని ఇది పెంచుతుంది. అయితే నెయ్యి వలన ఎన్ని లాభాలని పొందొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం…

పొడి దగ్గు తగ్గుతుంది...

గొంతు గరగర, దగ్గు వంటి సమస్యలను తగ్గించడానికి నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. బాగా దగ్గుగా వున్నా లేదా గొంతు నొప్పిగా ఉన్నప్పుడు గోరువెచ్చని నెయ్యిని ఒక టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది…

కంటి మసక కూడా తగ్గే అవకాశం..!

కంటి ఆరోగ్యానికి కూడా నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం చూసుకున్నట్లయితే వివిధ రకాల సమస్యల నుండి కళ్ళని రక్షిస్తుంది నెయ్యి. కాబట్టి కంటి ఆరోగ్యం కోసం కూడా నెయ్యిని తీసుకోండి.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది!

రోగ నిరోధక శక్తిని పెంచి తగినంత సామర్థ్యం ఇవ్వడానికి నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. అలానే అనారోగ్య సమస్యలని కూడా తగ్గుతుంది. చూసారు కదా నెయ్యి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కనుక కచ్చితంగా మీ డైట్ లోనెయ్యిని తీసుకోండి తద్వారా ఎన్నో ప్రయోజనాలను మీరు పొంది ఆరోగ్యంగా ఉండచ్చు…

నెయ్యి తింటే ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి. వీటి వ‌ల్ల మ‌నం తీసుకునే ఆహారం త్వ‌ర‌గా అరుగుతుంది. నెయ్యి వ‌ల్ల అనారోగ్యం అనేది కూడా అపోహ‌నే. నిజానికి నెయ్యి మ‌న‌కు అరోగ్య‌మే ఇస్తుంది. నెయ్యిలో యాంటీ ఫంగ‌ల్‌, యాంటీవైర‌స్ గుణాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి మ‌న ఇంట్లో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. ఈ స‌మ‌యంలో మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందించుకోవ‌డం అవ‌స‌రం. కాబ‌ట్టి, నెయ్యి తిన‌డం మంచిదే..
R9TELUGUNEWS.COM.