పెరుగు పంచదార కలిపి తింటున్నారా..? ఆ సమస్యలన్నీ హాంఫట్ అంటున్న నిపుణులు…..

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు దృఢంగా ఉండేలా పనిచేస్తుంది. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. చాలా మంది ఉదయాన్నే పెరుగులో పంచదార కలిపి తినడాన్ని మీరు చూసే ఉంటారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిదని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు..*

*పెరుగును సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పెరుగులో పంచదార కలిపి తింటే శరీరంలో గ్లూకోజ్‌కు లోటు ఉండదు..వేసవిలో పెరుగు, పంచదార తినడం ద్వారా రోజంతా శక్తివంతంగా ఉంటారు..*

*పెరుగు – చక్కెర తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇంకా అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా పెద్దప్రేగు కాన్సర్ రాకుండా కాపాడుతుంది..*

*ఉదయాన్నే అల్పాహారంలో పెరుగు, పంచదార తీసుకుంటే పొట్టకు చల్లదనం చేకూరుతుంది. ఇది కడుపులో చికాకు, అసిడిటీ వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం ద్వారా పలు విష పదార్థాలు కూడా* *తొలగిపోతాయి. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది. ఇది ఒత్తిడి, అలసటను తగ్గిస్తుంది.*

*పెరుగు, పంచదార కలిపి తీసుకుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య తగ్గుతుంది. దీని వినియోగం గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది.*
*పెరుగు, పంచదార కలిపి తీసుకుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య తగ్గుతుంది.* *దీని వినియోగం గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది..*

*అయితే.. మధుమేహం ఉన్న వారు.. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించిన అనంతరం తినడం మంచిది*
*అయితే.. మధుమేహం ఉన్న వారు..పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించిన అనంతరం తినడం మంచిది….