హార్ట్ ఎటాక్‎తో 8 నెలల గర్భవతి, యాక్టర్ ప్రియ మృతి..!

హార్ట్ ఎటాక్‎తో 8 నెలల గర్భవతి, యాక్టర్ ప్రియ మృతిచెందింది. ఈ విషాద ఘటన మలయాళ చిత్ర పరిశ్రమలో నెలకొంది. ప్రముఖ టీవీ నటి డాక్టర్ ప్రియ (35) ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి. ఆమె అక్టోబర్ 31న రెగ్యులర్ ప్రెగ్నెన్సీ చెకప్‌ కోసం ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ ఆమె ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే డాక్టర్లు పరిశీలించగా.. ప్రియ గుండెపోటుతో మరణించిందని గుర్తించారు. అప్రమత్తమైన వైద్యులు.. వెంటనే ఆమెకు సిజేరియన్ చేసి, బిడ్డను బయటకు తీశారు. ప్రస్తుతం ఆ శిశువు ఐసీయూలో చికిత్స పొందుతుంది. ప్రియ మృతికి సంతాపం తెలుపుతూ.. మలయాళ నటులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
డాక్టర్ ప్రియ ‘కరుతముత్తు’ పాపులర్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రియ వృత్తిరీత్యా డాక్టర్‌ కూడా. ఆమె తిరువనంతపురంలోని పీఆర్‌ఎస్‌ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. అయితే వివాహమైన తర్వాత ప్రియ తన నటనకు విరామం తీసుకుంది.