హైదరాబాద్‌లో అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దు…వాతావరణ శాఖ…

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తుంది. అంతేకాదు రాబోయే మూడు గంటల్లో నగరంలో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఇక జూలై నెలలోనే అతిపెద్ద వర్షమంటున్నారు వాతావరణ శాఖ. దీంతో పోలీసులు, జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. అంతేకాదు అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలంది వాతావరణ శాఖ..ఎక్కడ చూసిన వరదనీరే కన్పిస్తోంది. రోడ్లపై భారీగా వరద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమవగా..ప్రజలు కొన్ని చోట్ల ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు…