నల్గొండ జిల్లాలో కుప్ప కూలిన శిక్షణా హెలికాప్టర్…మహిళా పైలెట్ సహా ఇద్దరు దుర్మరణం..

నల్గొండ జిల్లాలో కుప్ప కూలిన శిక్షణా హెలికాప్టర్…

నల్గొండ జిల్లా: పెదవూర మండలంలోని తుంగతుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో,,, ఓ శిక్షణా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందారు. ఫైలట్‌తోపాటు ట్రైనీ ఫైలట్ సజీవ దహనమయ్యారు. పెద్ద శబ్ధంతో హెలికాప్టర్‌ పేలిందని స్థానిక రైతులు చెబుతున్నారు. ఘటనా సమయంలో దట్టమైన మంటలు చూశామని చెబుతున్నారు స్థానిక రైతులు.. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది.. వైద్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.. అసలు ప్రమాదం ఎలా జరిగింది..? కారణం ఏమై ఉంటుంది? అనే విషయాలపై ఆరా తీసే పనిలో పడిపోయారు.. ఇక, శిక్షణ హెలికాప్టర్ కూలిన సమాచారాన్ని ఎయిర్‌ఫోర్స్ అధికారుల‌కు చేరవేశారు స్థానిక అధికారులు. అయితే, ఈ ఘటనలో పైలట్‌తో పాటు మహిళా ట్రైనీ పైలట్‌ మృతిచెందినట్టు అధికారులు చెబుతున్నారు. సాగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఏవియేషన్‌ కంపెనీకి చెందిన చాపర్‌గా గుర్తించారు..ఘటనా స్థలానికి చేరుకుంటున్న రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యటు చేపట్టింది…

పెద్దవూర పరిధిలో ట్రైనీ విమానం ప్రమాదంపై ఎస్పీ రెమా రాజేశ్వరి కామెంట్స్…

ట్రైనీ చాపర్ ప్రమాదంలో శిక్షణ పొందుతున్న మహిళ స్పాట్ లోనే చనిపోయింది.

“సెస్నా 152″ఎయిర్ క్రాఫ్ట్ చాపర్ ట్రైనింగ్ కోసం యూజ్ చేస్తారు.

మాచర్ల వద్ద గల ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన చాపర్ గా గుర్తించాం.

చాపర్ మాచర్లలో 10.30 ని.కు టేకాఫ్ అయ్యింది.

20 నిమిషాల వ్యవధిలోనే ఎయిర్ లోనే క్రాష్ అయ్యింది.

ప్రమాదానికి గల కారణాలపై పోలీస్, DGCA సంయుక్తంగా సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం..

అనుమానాలు..

ఎయిర్ క్రాఫ్ట్.. క్రాష్…

నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ లో ఉన్న ఫ్లై టెక్ ఏవియేషన్ pvt లిమిటెడ్ సంస్థ కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ విమానం గా గుర్తింపు.. ప్రస్తుతం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అందులో తమిళనాడు కు చెందిన మహిమా అనే ట్రైనీ పైలెట్ ఒక్కరే వున్నట్లుగా చెప్తున్నారు…….
133 kv ఎలక్ట్రికల్ పోల్స్ కు తగిలి విమానం క్రాష్ అయిందని భావిస్తున్న పోలీసులు.
.