రెండు హెలికాప్టర్స్ గాలిలో..ఢీ..!

*రెండు హెలికాప్టర్స్ గాలిలో..ఢీ*

విన్యాసాలు చేస్తుండగా ప్రమాదం..‼️

మలేసియాలో రాయల్ మలేసియన్ నేవీ దినోత్సవం సందర్భంగా…

ఇందుకోసం పెరక్లోని లుమత్ ప్రాంతంలో మంగళవారం రిహార్సల్స్ ప్రాక్టీస్..

ఈ క్రమంలో ఉదయం శిక్షణ విన్యాసాల నిమిత్తం పడంగ్ సితియావాన్ నుంచి గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్ది క్షణాలకే ప్రమాదవశాత్తూ ఢీకొని కుప్పకూలిన వైనం…

వీటిల్లో ఒకటి విన్యాసాలు జరుగుతున్న ప్రాంతానికి పక్కనే ఉన్న స్థానిక స్టేడియంలో కూలిపోగా..

మరొకటి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయింది.

ఈ ప్రమాదంలో మరణించిన రెండు హెలికాప్టర్లలో ఉన్న 10 మంది సిబ్బంది..

వీరిలో ఇద్దరు లెఫ్టినెంట్ కమాండర్ లు ఉన్నారు..

రాయల్ మలేషియన్ నేవి వేడుకల కోసం హెలికాప్టర్లు రిహార్సల్(Helicopters Rehearsal) ప్రదర్శన చేస్తుండగా.. అందులో ప్రమాదవశాత్తు రెండు నేవీ హెలికాప్టర్ల రెక్కలు ఒకదానికొటి తాకాయి. దీంతో క్షణాల్లోనే ఆ రెండు హెలికాప్టర్లు కుప్పకూలాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది…లుముట్‌లోని రాయల్ మలేషియన్ నేవీ(RMN) బేస్ దగ్గర ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. M503-3 మారిటైమ్ ఆపరేషన్స్ హెలికాప్టర్(HOM) లో ఏడుగురు సిబ్బంది ఉండగా.. మరొక M502-6 హెలికాప్టర్‌లో ముగ్గురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. మే నెలలో 3 – 5వ తేదీల మధ్య జరగనున్న నేవీ డే వేడుకల సందర్భంగా ఈ హెలికాప్టర్లు శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.