ఆడ‌పిల్ల పుట్టింద‌ని – హెలికాఫ్టర్ లో తీసుకువ‌చ్చిన ఫ్యామిలీ…

ఒకవైపు కొడుకు పుట్టాలని కొందరు ప్రార్థిస్తుంటే… మహారాష్ట్రలోని పూణెలో ఓ కుటుంబం ఆడపిల్ల పుట్టిన వేడుకను విభిన్నంగా జరుపుకుంది. ఇంట్లోకి వచ్చిన నవజాత శిశువుకు అపూర్వంగా స్వాగతం పలికారు. పూణెలోని షెల్‌గావ్‌కు చెందిన ఓ కుటుంబం హెలికాప్టర్‌లో తమ చిన్న దేవదూతను ఇంటికి తీసుకువచ్చింది. ఈ సంఘ‌ట‌న‌కి సంబంధించిన వీడియోను వార్తా సంస్థ ANI షేర్ చేసింది..ఖేడ్‌లోని షెల్‌గావ్‌లోని తన ఇంటికి నవజాత శిశువును తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నారు. బాలిక తండ్రి విశాల్ ఝరేకర్ (30 సంవత్సరాలు) వృత్తిరీత్యా న్యాయవాది. మా ఇంట్లో చాలా కాలం తర్వాత ఆడబిడ్డ పుట్టిందని, ఎనలేని సంతోషంగా ఉంద‌ని విశాల్ అన్నారు.ఏప్రిల్ 2 న నా భార్య నేను రాజలక్ష్మిని హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకువచ్చాం. దానికి లక్ష రూపాయలు ఖర్చు చేశానని విశాల్ చెప్పాడు. షెల్గావ్‌లోని తన పొలంలో నిర్మించిన తాత్కాలిక హెలిప్యాడ్‌లో హెలికాప్టర్ ల్యాండ్అయ్యిందని ఝరేకర్ తెలిపారు.