నిద్రలేమి సమస్యతో బాధపడేవారు..చిట్కాను పాటిస్తే నిద్ర బాగా పడుతుంది..

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఇప్పుడు చెప్పే చిట్కాను పాటిస్తే నిద్ర బాగా పడుతుంది. .

నిద్ర బాగా పట్టాలంటే అశ్వగంధ చాలా బాగా సహాయపడుతుంది. అశ్వగంధలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అశ్వగంధను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఒత్తిడిని దూరం చేసి మంచి నిద్ర పట్టడానికి అశ్వగంధ చాలా బాగా సహాయపడుతుంది. . అశ్వగంధలో ఉండే త్రి ఇథైల్ గ్లైకాల్ అనేది నిద్ర పట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది.

రాత్రి పడుకోవడానికి అరగంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పావు స్పూన్ పొడిలో సగం అశ్వగంధ పొడి కలిపి తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది. ఈ విధంగా కొన్ని రోజుల పాటు తీసుకుంటే నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే అశ్వగంధను తీసుకోవటం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.