వేసవిలో ఎండవేడి నుండి శరీరం చల్లబడాలంటే, తీసుకోవలసిన జాగ్రత్తలు..

వేసవిలో ఎక్కువగా లభించే సీజనల్ ఫ్రూట్స్ లో పుచ్చకాయ ఒకటి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన పండు. ఇందులోని లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, బి6, సి, పొటాషియం, అమైనో యాసిడ్లు వంటివి వేసివిలో ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ సీజ‌న్‌లో తాటి ముంజ‌లు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న వేడి త‌గ్గిపోతుంది. శ‌రీరం చ‌ల్లబడుతుంది. అలాగే మ‌ల‌బ‌ద్దకం ఉండ‌దు. ముంజ‌ల్లో ఉండే కాల్షియం, ఐర‌న్‌, జింక్‌, కాప‌ర్‌, మెగ్నిషియం, సెలీనియం త‌దిత‌ర పోష‌కాలు శ‌రీరంలో ఉండే నీటి శాతం త‌గ్గకుండా చూస్తాయి…

ఎండ వేడిమి నుంచి రిలీఫ్ కోసం కీర దోస‌.

ఎండలు అప్పుడే మండుతున్నాయి. బ‌య‌ట గంట సేపు కంటే ఎక్కువ న‌డిస్తే చాలు శరీరం త్వరగా అలసిపోతోంది. ఈ సమస్యను అధిగమించటానికి కీర ఎంతో ఉపకరిస్తుంది. కీరతో చాలా లాభాలు ఉన్నాయి. శ‌రీరాన్ని ఎండ వేడిమి నుంచి ర‌క్షించుకునేందుకు వీటిని ప్ర‌య‌త్నించండి….
కీరలో విటమిన్ బి పుష్కలం. కాఫీలు, టీలు తాగే బదులు కీర ముక్కలు అప్పుడప్పుడు తింటే వేసవిలో ఉదర సమస్యలు తలెత్తవు.
కీర, చర్మాన్ని కాంతివంతంగా ఉంచడమే కాకుండా కళ్లకింద నల్లచారలు రాకుండా కాపాడుతుంది. అప్పుడప్పుడు కీర ముక్కల్ని కళ్లమీద పెట్టుకుంటే స్వాంతన లభిస్తుంది. ఎండలు అప్పుడే పెరిగాయి కనుక నీళ్ల మోతాదు ఎక్కువుగా ఉన్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. కీరలో 95 శాతం నీరు వుంటుంది. కాబట్టి తరచూ దీన్ని తినవచ్చు. శరీరం డీహైడ్రేడ్ అవ్వదు. వ్యర్ధాలు కూడా బయటకు తొలగిపోతాయి. చర్మానికి అవసరమైన విటమిన్ సి లభిస్తుంది.

.వేసవిలో తప్పక తీసుకోవాల్సిన కూరల్లో కీర దోస ఒకటి. మనల్ని రోజంతా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కీర‌దోస‌లను తింటే శ‌రీరం చ‌ల్లబడుతుంది. శ‌రీరానికి త‌గినంత నీరు ల‌భిస్తుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. శరీరంలోని టాక్సిన్లను కూడా బయటకు పంపించేస్తుంది. నిమ్మరసం, ఉప్పు వేసుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుంది. ద్రాక్షల్లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఎక్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని వేస‌విలో తింటే శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. అలాగే శ‌రీరం చల్లగా ఉంటుంది. వేస‌విలోపనిచేసి త్వరగా అలసి పోయేవారు స‌పోటా పండ్లను తింటే తక్షణ శ‌క్తి ల‌భిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఒంట్లో ఉన్న నీరు త‌గ్గిపోకుండా ఉంటుంది…వేసవి కాలంలో తీసుకోవాల్సిన ద్రవాల్లో మజ్జిగ కూడా ఒకటి. రోజులో తగినన్ని ఎక్కువ సార్లు మజ్జిగ తాగటం వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరంలో బ్యాక్టీరియాను నాశనం చేసి జలుబు,దగ్గు వంటి సాధారణ సమస్యలు దరిచేరకుండా చూస్తుంది. వేసవిలో పుదీనాను వాడటం మంచిది. పెరుగులో కొద్దిగా పుదీనాను చేసి రైతాగా తీసుకోవచ్చు. వేసవిలో శరీర వేడిని తగ్గించటంలో ఉపయోగపడుతుంది.

ద్రాక్ష :- ద్రాక్ష పళ్ళు తినటం వల్ల మనకు వడ దెబ్భ తగలకుండా ఇవి చాలా వరకూ కాపాడుతుంది. దీనివల్ల వేడి మంటలను తగ్గిస్తుంది. మైగ్రేన్ మరియు కంటి సమస్యలతో బాదపదేవారు ద్రాక్ష తినటం వల్ల ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు.
ఆరంజ్ :- ఆరంజ్ తినటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఆరెంజ్ లో సి విటమిన్ పుష్కలంగా లబిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల కిడ్నీలకు సబంధించిన వ్యాధులు రావు. అంతేకాక లివర్ క్యాన్సర్ నుంచి ఇవి కాపాడుతాయి. ఇందులో ఉన్న విటమిన్స్ వల్ల మనకు చర్మం కూడా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.
పుచ్చకాయ:- సాదారణంగా పుచ్చ కాయలు వేసవి కాలంలో ఎక్ఈకువగా లబిస్తాయి. పుచ్చకాయ తీసుకోవడం వల్ల ఎముకలకు చాలా మంచిది. దీనిని తీసుకోవడం వల్ల ఎటువంటి కంటి సబందిత జబ్బులు గుండె జబ్బులు రావు. పుచ్చకాయలోని పోషకాల వాళ్ళ మన కండరాలను మరియు నరాలను ఉత్తేజ పరిచి బాగా పనిచేసేలా చేస్తాయి.
ఆపిల్:- రోజూ ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదని చాలా మంది చెబుతారు. దానిలోని పోషకాలు తెలిస్తే అది నిజమేనని మనం నమ్మాల్సిందే. ఎందికంటే ఆపిల్ తినడం వల్ల మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది. దేనిని తీసుకోవడం వల్ల ఎటువంటి క్యాన్సర్ లను మన దరి చేరనివ్వదు. ఇది మన శరీరంలోని కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. చేసు కొలెస్ట్రాల్ బయటికి పంపిస్తుంది. మరియు అల్జీమర్ వంటి వాటి నుంచి కూడా మనల్ని కాపాడుతుంది.
స్ట్రాబెర్రీ:- మీ చర్మాన్ని ముడతలు లేకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది, రోగ నిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది అంతేకాక శరీర శక్తిని పెంచుతుంది, శరీరంలోని మంటను తగ్గిస్తుంది, క్యాన్సర్ వంటి కణాలను రాకుండా పోరాడుతుంది.
జామకాయ:- శరీరంలోని హార్మోన్ల పనితీరును మెరుగుపరుచి వాటిని సంతులంగా ఉండేటట్లు చూస్తుంది. మలబద్ధకం వంటివి రాకుండా సహాయపడుతుంది, శారీరిక శ్రమను తగ్గించి విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది మరియు మెదడుకు మంచిది.
కివీస్ :- ఇది ప్రసవించిన తర్వాత మహిళలకు మంచిది ఎందుకంటే వీటిద్వారా రోగనిరోధక శక్తి ఎక్కువగా పెంచుతుంది. మరియు ఆకలి పుట్టిస్తుంది ఇది నిద్రను కూడా మెరుగుపరుస్తుంది.
పైన పేర్కొన్న ఈ పండ్ల వల్ల అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయని మనకు తెలిసినా కూడా వాటిని తినకపోతే మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడు చేసుకున్నవారవుతాము అందుకే ఇప్పటి నుంచి ప్రతీరోజూ లేదా ప్రతి వేసవిలో ఈ పండ్లను తిని మన ఆరోగ్యాన్ని మరింత కాపాడుకుందాం.