మీకు మతి మరుపు వస్తున్నదా… స‌మ‌స్య‌కు చ‌క్క‌టి ప‌రిష్కారం…!!!

*మీకు మతి మరుపు వస్తున్నదా*
*ఉదయం నిద్ర లేవగానే లీటరు నీటిని కచ్చితంగా తాగండి. మొదట్లో వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత అలవాటు… అవుతుంది. నీళ్లు తాగగానే కాసేపు అటు.. ఇటు నడిచి మలమూత్ర విసర్జనకు వెళ్లండి. ఇలా చేయడం వల్ల చాలా వరకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

*మ‌తిమ‌రుపు పెరిగిపోతోందా?…

చ‌దివింది గుర్తుండ‌డం లేదా?
ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌టి ప‌రిష్కారం క్యాండిల్ ట్రిక్.!
ఉద‌యం నిద్ర లేవ‌గానే….. ప‌ద్మాస‌నం లో కూర్చొని, కొద్ది దూరంలో స‌రిగ్గా మ‌న కంటికి స‌మాన‌మైన దిశ‌లో ఓ వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తూ ఉండాలి…. మారుతున్న దాని మంట రంగు, గాలికి క‌దులుతూ త‌న షేప్ ను మార్చుకుంటున్న తీరును కూడా ఓ 5 నిమిషాల పాటు త‌దేకంగా ప‌రిశీలిస్తూ ఉండాలి…అటు త‌ర్వాత… ఆ వెలుగుతున్న కొవ్వొత్తిని ఆర్పివేసి…ఇప్పుడు క‌ళ్లు మూసుకొని ఇంత‌కు ముందులా కొవ్వొత్తి వెలుగుతున్న‌ట్టు ….మ‌నో నేత్రంతో చూడాలి (ఊహించుకోవాలి).

ఇలా ప్ర‌తిరోజు..చూస్తూ ఉండాలి…. అయితే మొద‌టి రోజు 5 నిమిషాల పాటు వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తే…క్ర‌మంగా ఆ స‌మ‌యాన్ని త‌గ్గించుకుంటూ పోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తితో పాటు ఊహాశ‌క్తి కూడా అమాంతం పెరుగుతుంది. మీరు ట్రై చేసి మీ అనుభ‌వాన్ని మాతో పంచుకోండి.

* రోజువారీ పనుల ఒత్తిళ్లో.. లేనిపోని వాగ్వాదాలో.. ఇలాంటివన్నీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తాయి. నిజానికివి కొద్దిరోజుల్లో సర్దుకుపోతాయి గానీ దీర్ఘకాలంగా కొనసాగితే జ్ఞాపకశక్తిపై విపరీత ప్రభావం చూపొచ్చు. కాబట్టి ఒత్తిడిని నియంత్రించుకోవటం, తగ్గించుకోవటం అత్యవసరం. గాఢంగా శ్వాస తీసుకోవటం, యోగా, ఒక అంశం మీద దృష్టి నిలపటం వంటి పద్ధతులతో ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవచ్చు.

* కంటి నిండా నిద్రపట్టకపోతే ఆ రోజంతా చికాకుగా ఉండటం తెలిసిందే. ఏ విషయాలూ చప్పున గుర్తుకురావు కూడా. జ్ఞాపకశక్తికి నిద్ర ఎంత అవసరమో దీన్ని బట్టే తెలుసుకోవచ్చు. నిద్రలోనే మనం నేర్చుకున్న విషయాలు జ్ఞాపకాలుగా స్థిరపడతాయి. కాబట్టి రాత్రిపూట కంటి నిండా నిద్రపోయేలా చూసుకోవాలి. కొందరు నిద్రలేమికి మాత్రలు వేసుకుంటుంటారు గానీ ఇవి మెదడు పనితీరుకు ఆటంకం కలిగించి జ్ఞాపకశక్తి తగ్గేలా చేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి ముందుగా రోజూ సమయానికి నిద్రపోవటం, లేవటం.. పడకగది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవటం.. సాయంత్రం తర్వాత కాఫీ, టీలు తాగకపోవటం వంటి పద్ధతులను పాటించటం మంచిది.

* పొగ అలవాటు గుండె, ఊపిరితిత్తులకే కాదు.. మెదడుకూ చేటే. వయసుతో పాటు వచ్చే మతిమరుపు, ఇతర జ్ఞాపకశక్తి సమస్యలు పొగ తాగేవారిలోనే ఎక్కువ. పొగతాగనివారితో పోలిస్తే.. మధ్యవయసులో రోజుకు 2 పెట్టెల కన్నా ఎక్కువ సిగరెట్లు కాల్చేవారికి వృద్ధాప్యంలో డిమెన్షియా ముప్పు రెట్టింపు అవుతుంది.

* మద్యం మితిమీరినా మతిమరుపు, డిమెన్షియా ముప్పు పెరుగుతుంది. మద్యం అలవాటు గలవారు సరకులను గుర్తుంచుకోలేకపోవటం వంటి పనులను సరిగా చేయలేరు. ఇక దీర్ఘకాలంగా విటమిన్‌ బి1 లోపం గలవారికి మద్యం దుష్ప్రభావాలు కూడా తోడైతే హఠాత్తుగా మతిమరుపు తలెత్తే ప్రమాదమూ ఉంది…

మతిమరుపు సమస్య తగ్గిపోవాలా..యోగా చేయండి..జ్ఞాపకశక్తిని నిలబెట్టండి!
మన జీవితంలో జ్ఞాపకశక్తి కీలకపాత్ర పోషిస్తుంది. మనం చేసే అన్ని పనులకూ ఇదే మూలం. కాబట్టి జ్ఞాపకశక్తి తగ్గకుండా చూసుకోవటం చాలా అవసరం. రోజూ కొద్దిపాటి జాగ్రత్తలతో దీన్ని కాపాడుకోవచ్చు.

యోగా వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తిని కాపాడుతుందని చెప్పారు. ముఖ్యంగా మహిళా యోగా అభ్యాసకులు -యోగినిలలో. యోగ చేసిన వారిలో జ్ఞాపకశక్తి తదితర కాగ్నిటివ్‌ ఫంక్షన్లకు కారణమైన మెదడులోని భాగం ఎంతో దృఢంగా ఉండడాన్ని గుర్తించారు. దీన్నిబట్టి వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యంగా ఉండడానికి, బాగా ఆలోచించడానికి, జ్ఞాపకశక్తి కోల్పోకుండా ఉండడానికి యోగ ఎంతో బాగా ఉపయోగపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు…
ఏకాగ్రత, ధ్యానం చాలా అవసరము…

యోగాను ఎప్పుడూ అభ్యసించని ఆరోగ్యకరమైన వృద్ధులతో పోల్చితే వృద్ధుల దీర్ఘకాలిక యోగా అభ్యాసించిన వారి మెదడు నిర్మాణం పరంగా ఏమైనా తేడాలు ఉన్నాయా అని పరిశోధకులు పరిశీలించాలనుకున్నారు. యోగ సాధన చేయకుండా ఆరోగ్యంగా ఉన్న సీనియర్‌ సిటిజన్స్‌ను కూడా పరీక్షించారు. ఈ రెండు రకాల వ్యక్తుల మధ్య ఎలాంటి తేడాలు కనపడ్డాయో గమనించారు. అధ్యయనం చేసేందుకు ఎనిమిదేళ్లుగా కనీసం వారానికి రెండు పర్యాయాలు యోగ చేస్తున్న కొంతమంది సీనియర్‌ మహిళలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. కానీ ఈ బృందానికి సగటున దాదాపు 15 సంవత్సరాల యోగాభ్యాసం ఉంది. అయితే యోగ, ధ్యానం చేయని మహిళలకు, వీటిని చేస్తున్న ఆడవాళ్లకు మధ్య ఉన్న తేడాలను పరిశీలించారు. మాగ్నటిక్‌ రెసొనెన్స్‌ ఇమేజింగ్‌ ప్రక్రియ ద్వారా వీరి మెదడు నిర్మాణంలో ఏవైనా మార్పులు సంభవించాయా అనే విషయాన్ని పరిశీలించారు. ఈ అధ్యయనాల్లో తేలిందేమిటంటే యోగ చేసిన వారిలో జ్ఞాపకశక్తి తదితర కాగ్నిటివ్‌ ఫంక్షన్లకు కారణమైన మెదడులోని భాగం ఎంతో మందంగా ఉండడాన్ని గుర్తించారు. దీన్నిబట్టి వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యంగా ఉండడానికి, బాగా ఆలోచించడానికి, జ్ఞాపకశక్తి కోల్పోకుండా ఉండడానికి యోగ ఎంతో బాగా ఉపయోగపడుతుందని అర్థమైంది.

జ్ఞాపకశక్తిని పెంచే ఫుడ్
వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి ముంచడం మందగించడం సహజమే అయితే శారీరక శ్రమ మరియు యోగా వంటి ఆలోచనాత్మక పద్ధతులు యాంటీఆక్సిడెంట్-రిచ్, కలర్ ఫుల్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ మరియు మీ మెదడును హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించేందుకు సహాయపడతాయి. జ్ఞాపకశక్తిని నిలుపుకోవడంలో ఎంతో సహాయపడతాయి . జ్ఞాపకశక్తి ని పెంచే అద్భుతాలు చేసే కొన్ని ఆహారం ఇక్కడ ఉన్నాయి.

విటమిన్ సి, బి..
సిట్రస్ పండ్లలో లభించే విటమిన్ సి మానసిక చురుకుదనం తో ముడిపడి ఉంటుంది, అయితే విటమిన్ బి వయస్సు-సంబంధిత మెదడు సంకోచం మరియు అభిజ్ఞా బలహీనత నుండి రక్షణ కల్పిస్తుంది. మీ మెదడు శక్తిని పెంచడానికి బ్లాక్‌క్రాంట్లు, చేపలు, ఆకుకూరలు, పుట్టగొడుగులు, వేరుశెనగ, నువ్వులు మరియు గుడ్లపై లోడ్ చేయండి.

గింజలు, విత్తనాలు..
కొన్ని విత్తనాలు మరియు కాయలు మీ జ్ఞాపకశక్తిని గణనీయంగా మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుమ్మడికాయ గింజలు జింక్‌తో లోడ్ చేయబడతాయి, ఇవి మీ జ్ఞాపకశక్తిని పదును పెట్టడంలో గొప్ప పాత్ర పోషిస్తాయి. వాల్ నట్స్ లోని ఫోలిఫినాల్స్ న్యూరాన్స్ మరియు బ్రెయిన్స్ మద్య కమ్యూనికేషన్ అభివృద్ధి చేస్తుంది . ఒక గుప్పెడు వాల్ నట్స్ తినడం వల్ల, మీరు 19 శాతం మెమరీని పవర్ ను మెరుగుపరచుకొనే అవకాశం ఉంది. పొద్దుతిరుగుడు విత్తనాలు విటమిన్ ఇ యొక్క మంచి వనరులు. వేరుశెనగలో కూడా విటమిన్ ఇ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ నిండి ఉంటుంది. బాదం మరియు హాజెల్ నట్స్ కూడా జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడతాయి.

బెర్రీస్..
ఇవి చూడటానికి చిన్నగా ఉన్నా, ఇవి మొత్తం శరీర ఆరోగ్యంతో పాటు, బ్రెయిన్ ఫుడ్ గా కూడా వీటిని ఎక్కువగా తీసుకుంటారు. ఇది మెదడును చురుకుగా ఉంచడంతో పాటు మిమ్మల్ని యాక్టివ్ గా ఉండేందుకు సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు అయిన ఆంథోసైనిన్స్ అనే పదార్థాలు బ్లూబెర్రీస్ లో పుష్కలంగా ఉంటాయి. రోజూ బ్లూబెర్రీస్ తినడం వల్ల జ్ఞాపకశక్తిని కోల్పోకుండా పోరాడటానికి సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలు కూడా, క్రమం తప్పకుండా తినడం వల్ల వయస్సు పెరుగుతునప్పుడు -సంబంధిత జ్ఞాపకశక్తి క్షీణించడంలో సహాయపడుతుంది.

కూరగాయలు..
శరీరం మొత్తం మరియు మెదడుకు విస్తరించిన రక్తనాళాలకు అవసరం అయ్యే మెగ్నీషియం ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి బెయిన్ పవర్ కు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా చాలా అవసరం. బ్రోకలీ, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్, బచ్చలికూర అన్ని ఆకుపచ్చ కూరగాయలలో ఇనుము, విటమిన్ ఇ, కె మరియు బి9, విటమిన్ సి వంటి ఫైటోన్యూట్రియెంట్స్ మెదడు కణాల అభివృద్ధికి చాలా ముఖ్యమైనవి.

అవోకాడో..
మెదడుకు సహాయపడే మంచి కొవ్వు ఈ పండులో పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్త ప్రవాహాన్నిపెంచి మెదడు ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. మరియు విటమిన్ ఇ తో సమృద్ధిగా ఉన్న అవోకాడోస్ యాంటీఆక్సిడెంట్లతో అధికంగా ఉన్నాయి. ఇది మెదడును ఆరోగ్యంగా మరియు అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుంది. అవోకాడోలు అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించడంతో కూడా సహాయపడుతుంది.

టొమాటాలు..
మెదడు కణాలను డ్యామేజ్ చేసి ఫ్రీరాడికల్స్ నుండి రక్షించడానికి, లైకోపిన్ అనే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ టమోటోలో పుష్కలంగా ఉంటుంది. కొత్త మెదడు కణాల నిర్వహణ మరియు ఉత్పత్తిలో సహాయపడుతుంది. అందువల్ల టమోటోలను రెగ్యులర్ డైట్ లో తీసుకోవడం చాలా మంచిది.

తృణధాన్యాలు..
తృణధాన్యాలు శక్తి యొక్క శక్తి కేంద్రంగా పరిగణించబడతాయి. మరియు మీరు బాగా దృష్టి పెట్టడానికి సహాయపడతాయి. ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు తినేటప్పుడు, శక్తి శరీరంలో చక్కెర రూపంలో విడుదలవుతుంది, ఇది మెదడు సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది, మనల్ని అప్రమత్తంగా ఉంచుతుంది