యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలా తగ్గించుకోవాలి? సలహాలు…

యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలా తగ్గించుకోవాలి? సలహాలు.

యూరిన్ పరీక్ష తరువాత, డాక్టర్ సలహా మేరకు మందులన్నీ కోర్స్ ప్రకారం తప్పనిసరిగా వాడాలి. ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టింది కదా అనుకుని మందులు వేసుకోవడము మధ్యలో ఆపగూడదు.

ప్రతి రోజూ శరీరానికి అవసరం అయ్యే నీరును తీసుకోవడం వల్ల శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవచ్చు. అంతే కాదు నీళ్ళు మూత్రంలో కలిసిపోయి కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా, నివారిస్తుంది. మరియు కిడ్నీలలో ఉండే టాక్సిన్స్ ను బయటకు ఫ్లష్ చేస్తుంది.ఎక్కువ నీళ్లు తాగి ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తూ ఉండాలి.

మూత్ర విసర్జన చేయాలనిపించినప్పుడు బలవంతంగా ఆపుకోకూడదు. ఆపుకోవటం వల్ల మూత్రాశయంలోని బ్యాక్టీరియా రెట్టింపై యుటిఐ కి దారితీస్తుంది.

*సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. ఎక్కువ నీళ్లు తాగటం వల్ల బ్యాక్టీరియా, మూత్రం ద్వారా కొట్టుకుపోయి ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది.*
మూత్రాన్ని బలవంతంగా ఆపుకోవటం వల్ల మూత్రాశయ పనితీరు దెబ్బతినవచ్చు. అందుకే వెంటనే మూత్ర విసర్జన చేస్తూ ఉండాలి.

*లోదుస్తుల శుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడ చాలా ముఖ్యం*.

*క్రాన్ బెర్రీ జ్యూస్ త్రాగడం వల్ల యూరినరీ బ్లాడర్ లోని బ్యాక్టీరియాను నివారిస్తుంది* . అందువల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ ని నివారించడానికి క్రాన్ బెర్రీ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి.

*అల్లం చాలా పాపులర్ హెర్బ్* . వంటలలో అల్లం వాడడం మంచిది. అల్లంలో జింజరోల్ అనే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్, బ్యాక్టీరియాను కిడ్నీలో వ్యాప్తి చెందకుండా నివారిస్తుంది.

*పెరుగులో ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా)అధికంగా* ఉండటం వల్ల, యిది కిడ్నీ మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో బాగా సహాయపడుతుంది .అందుకని పెరుగుని వాడితే మంచిది.

*పసుపు నేచురల్ రోగనివారక ఔషధం..* ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ని నివారిస్తుంది. మరియు ఇది చాలా త్వరగా కోలుకునేలా చేస్తుంది. పాలలో అర స్పూన్ పసుపు మిక్స్ చేసి తీసుకోవాలి. వంటలలో కూడా వాడుకుంటే ఇన్ఫెక్షన్ నివారణ కు బాగా వుపయోగపడుతుంది.