పూర్వం, పొట్ట పెరగడం వయసైపోవడానికి, బలమైన మందుల వాడకం వల్ల వచ్చింది అనడానికి గుర్తుగా ఉండేది. అయితే, ఇప్పటి ఫాస్ట్ ఫుడ్ ల వల్ల, సౌకర్యవంతమైన జీవన శైలి వల్ల యువకులు, చురుకుగా ఉండే వ్యక్తులకు కూడా బానపొట్ట వచ్చేస్తుంది. అయితే ఈ రోజుల్లో చాలా మందికి శరీరకంగా ఎదుర్కొకుంటున్న ఇబ్బంది ఊబకాయం…అధికబరువు ఉండడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అందరికీ తెలుసు. పొట్ట ఎక్కువగా ఉంటే ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. అయితే కొన్ని సింపుల్ ఎక్సర్సైజ్ల ద్వారా చేయడం ద్వారా 28 రోజుల్లోనే శరీరంలో ఉన్న అధిక కొవ్వు కరిగిపోతుంది. పొట్ట కూడా తగ్గి నాజూగ్గా తయారవ్వడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. నేలపై బోర్లాపడుకుని మోచేతులను కాలివేళ్ళను ఆధారంగా చేసుకుని శరీరం మొత్తాన్ని పైకి లేపాలి. ఇలా వీలైనంత సేపు ఉండాలి…వ్యాయమం వల్ల పొట్ట, ఛాతి కండరాలు, భుజాలపై అధిక ఒత్తిడి పడుతుంది. దీంతో శరీర భాగాల్లో ఉండే కొవ్వు కరిగుతుంది. మొదటిగా రెండురోజులు 20 సెకండ్లు, మూడు, నాలుగవరోజు 30 సెకండ్లు, ఐదవరోజు 40 సెకండ్లు, ఆరవరోజు విరామం ఇవ్వాలి. ఇలానే మూడువారాల పాటు చేయడం వల్ల ఫలితం కనిపిస్తుంది. ఆహారంలో అధిక కోవ్వు ఉన్న పదార్థాలను తీసుకోకూడదు. పీచు పదార్ధాలు,అకు కూరలు అధికంగా తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతి రోజూ చేయడం ద్వారా ఫలితం ఉంటుంది. పొట్ట కరగడమే కాదు..క్రొవ్వు కూడా కరుగుతుందంటున్నారు వైద్యులు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.