హైబీపీ ఉందా ? అయితే ఈ సూచనలను రోజూ పాటించండి.. బీపీ కచ్చితంగా అదుపులోకి వస్తుంది…

హైబీపీ ఉందా ? అయితే ఈ సూచనలను రోజూ పాటించండి.. బీపీ కచ్చితంగా అదుపులోకి వస్తుంది.అవగాహనా కోసం సలహాలు..

హైబీపీ ఉందా ? అయితే ఈ సూచనలను రోజూ పాటించండి.. బీపీ కచ్చితంగా అదుపులోకి వస్తుంది.అవగాహనా కోసం సలహాలు..*
ఉప్పు తినకూడదని కాదు, కాని ఎంత? లిమిట్ లో తినకపోతే ఎలా? పచ్చళ్ళు అని, పిండివంటలు అని అవసరానికి మించిన ఉప్పు తినేస్తాం.దీంతో సోడియం లెవెల్స్ పెరిగిపోయి హై బ్లడ్ ప్రెషర్ మొదలవుతుంది.

కాబట్ట సాధ్యమైనంతవరకు ఉప్పు తక్కువ తినండి.* ఇంతకుముందే తిండి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మంచి తిండి చాలా అవసరం.

ఫ్యాట్స్ ఎక్కువగా లేని ఆహారాలు, సోడియం ఎక్కువగా లేని ఆహారాల మీద దృష్టి కేంద్రీకరించండి.ఒకవేళ సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉంటే, పొటాషియం ఎక్కువ ఉండే ఆహారంతో బ్యాలెన్స్ చేయండి..

*1. ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల మీ శరీరంలో సోడియం మొత్తం పెరుగుతుంది. దీని కారణంగా అధిక బీపీ, స్ట్రోక్‌తో సహా ఇతర తీవ్రమైన గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. మీకు అధిక బీపీ సమస్య ఉంటే.. మీరు ఆహారంలో ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి. ఇదే కాకుండా ప్రాసెస్ చేసిన ఆహారానికి బదులుగా తాజా పండ్లను తీసుకోవాలి.*

2. మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే.. కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే ఇది మీ రక్తపోటును పెంచుతుంది. మనలో చాలా మంది ఆఫీసులో పనిచేసేటప్పుడు కాఫీ, టీ తాగుతారు. ఇది శరీరంలో చురుకుదనాన్ని తెస్తుంది. కాఫీ తాగిన తర్వాత శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు ఒకటి నుండి రెండు కప్పుల కాఫీ తాగడం ప్రయోజనకరం. కానీ మోతాదుకు మించి తాగితే బీపీ పెరుగుతుంది. కనుక టీ, కాఫీలను మోతాదులోనే తాగాల్సి ఉంటుంది.

*3. గుమ్మడి గింజల్లో అనేక పోషకాలు ఉంటాయి. అధ్యయనాల ప్రకారం.. వీటిలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. మీకు తక్కువ లేదా ఎక్కువ బీపీ ఏది ఉన్నా సరే.. గుమ్మడికాయ గింజలను ఆహారంలో చేర్చుకుంటే.. కచ్చితంగా సమస్య తగ్గుతుంది.*

4. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ఆరోగ్యంగా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వలన అధిక బీపీని నియంత్రించవచ్చు. ఇది గుండెకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి రోజుకు 30 నుండి 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఇదే కాకుండా ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. ఒత్తిడి తీవ్రమైన గుండె జబ్బులకు దారితీస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి. దీంతో బీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.