ఎండుద్రాక్ష కిస్మిస్….!. అరోగ్య ఉపయోగాలు..

🍇ఎండుద్రాక్ష కిస్మిస్..

ఇవి చలువచేసే స్వభావంతో తీపి, పులుపు రుచులతో కూడి మేహశాంతిని కలిగిస్తయ్. రక్త పైత్యం, శ్వాసరోగం, దాహరోగం, మొదలైన అనేక రోగాలను పోగొట్టి అతిమూత్రాన్ని హరించి వేస్తయ్. రక్తశుద్ధి, వృద్ధి కలిగిస్తయ్. ఇతర రకాలు పండ్లకన్నా ద్రాక్షపండ్లు బహుశ్రేష్ఠమైనవి.

🍇అల్పరక్తపోటు – రక్తహీనత

ఈనాడు చాలామంది యువతీయువకులు,
వివాహితులుకూడా రక్తహీనత సమస్యతో అల్పరక్త
పోటుతో అల్లాడుతున్నారు. ఈ సమస్యవల్ల కంటికింద గుంటలు, నల్లటి మచ్చలురావడం, జుట్టు
ఊడటం, ముఖము, కళ్ళు, గోళ్ళు, అరచేతులు,తెల్లగా పాలిపోవడం శక్తిహీనత, అలసట మొదలైన సమస్యలు కలుగుతాయ్. అలాంటివారంతా ఈ ప్రయోగం చేయండి.
అరగ్లాసు మంచినీటిలో శుభ్రంగా కడిగిన ఎండుకిస్మిసండ్లు 32వేసి రాత్రినుండి ఉద యంవరకు నానబెట్టి పరగడుపున ఆపండ్లు నిదా నంగా ఒక్కొక్కటి బాగా నమిలితిని ఆనీరుకూడా వడపోసుకొని తాగాలి.మరలా ఉదయం నానబెట్టి ఇదేవిధంగా సాయంత్రం తినాలి.
ఇలా 60 నుండి 90 రోజులుచేస్తే పైనతెలిపిన అన్నిసమస్యలు అదృ శ్యమైపోతయ్.

🍇జ్వరాలలో కలిగే – శోషకు

ఎండుద్రాక్షపండ్లను మితముగా, హితముగా తీసుకొని మంచినీటిలోవేసి పిసికి వడపోసుకొని ఆనీటిని తాగుతుంటే జ్వరాలలో కలిగే అలసట దాహము, శోష తగ్గిపోతయ్.

🍇జ్వరములో – నోరు ఎండిపోతుంటే

ద్రాక్షపండ్లు, పటికబెల్లం 20గ్రా॥ మోతాదు మెత్తగాదంచి రసంతీసి ఆరసాన్ని ఒకకప్పు మోతాదుగా తీపిదానిమ్మపండ్లరసంలో కలిపి నోట్లో పోసుకొని 5 నుండి 10 నిమిషాలసేపు పుక్కిలి పట్టి తరువాత పూసివేస్తుంటే తీవ్రజ్వరాలలో నోరు ఎండుకుపోవడం నాలుకకు రుచితెలియకపోవడం వంటి సమస్యలు తొలగిపోతయి

🍇మూత్రంలో రక్తంపోతుంటే?

రాత్రిపూట ఒకగిన్నెలో ఒకగ్లాసు నీరుపోసి అందులో 100 గ్రా॥ ద్రాక్షపండ్లువేసి నానబెట్టాలి. ఉదయంపూట చేతితోపిసికి గింజలను తోలును తీసివేసి అందులో అతిమధురం పొడి 2గ్రా. చందనంపొడి 1గ్రాము కలిపి పరగడుపున తాగు తూవుంటే మూత్రంలో రక్తం పడటం ఆగుతుంది.

🍇తీయని గొంతు-వాక్సుద్ధి, జ్ఞానసిద్ధి

గింజలు తీసిన ద్రాక్షపండ్లు 10 గ్రా॥, దోరగా. వేయించిన పిప్పళ్ళపొడి 3గ్రా॥, దోరగా వేయించిన చలువ మిరియాలపొడి 3 గ్రా॥, అతిమధురం పొడి, 10గ్రా॥, తీసుకొని అన్నీకలిపి రెండుపూటలా ఆహారానికి గంటముందు సేవిస్తుంటే గొంతు బొంగురువంటి ఇతర గొంతురోగాలు హరించి మాటలు తడబడటంపోయి మంచిస్వరం వస్తుంది. మెదడుకుబలం కలిగి జ్ఞానంకూడా

Note:-పిల్లలకు వయసునుబట్టి మోతాదు తగ్గించి ఇవ్వాలి.

🍇మూర్చరోగాలకు – ద్రాక్షపండ్లు

ద్రాక్షపండ్లు తామరతూన్డ్లు, పిప్పలికట్టె, సొంఠి, తిప్పతీగ వీటిని ఒక్కొక్కటి 5 గ్రా॥ మోతాదుగా తీసుకొని పావులీటరు మంచినీటిలో మరిగించి దించి వడపోసి అందులో ఒకగ్రాము దోరగా వేయించిన పిప్పళ్ళ పొడి కలిపి రోజూ పరగడుపున సేవిస్తూవుంటే క్రమంగా మూర్ఛరోగం హరించిపోతుంది.

🍇ప్రేగులలో – క్రిములు హరించుటకు

ఎండుద్రాక్షపండ్లు, వాయువిడంగాలు సమము రోటిలో వేసి మెత్తగా ముద్దలాగా దంచి మూడుపూటలా పూటకు కుంకుడు గింజంత ముద్ద చప్పరించి తింటుంటే ప్రేగులలోవుండే అన్నిరకాల క్రిములు మలం ద్వారా పడిపోతయ్.

🍇మూత్రపిండాలలో నొప్పితగ్గుటకు

ఒకద్రాక్షపండును తీసుకొని లోపలి గింజలను తీసివేసి అందులో కందిగింజంత మూసాంబరం పెట్టి ఆపండును వేళ్ళతో గోలీలాగా మడిచి మింగి నీరుతాగాలి. అయిదు నిమిషాలలో మూత్ర పిండాల నొప్పి తగ్గిపోతుంది..
🍇ఉబ్బసరోగాలకు – ద్రాక్షమాత్రలు

ఎండుద్రాక్షపండ్లు, పసుపు, నువ్వులపప్పు, సన్నరాష్ట్రం, దోరగా వేయించిన పిప్పళ్ళు, దోరగా వేయించిన మిరియాలు సమభాగంగా తీసుకొని మొత్తంమెత్తగా దంచి కుంకుడు గింజలంత గోలీలు చేసి నిలువ వుంచుకోవాలి.

రెండుపూటలా ఆహారానికి అరగంటముందు ఒకమాత్ర సేవించి ఒకకప్పు గోరువెచ్చని నీరు తాగుతుంటే ఉబ్బసరోగాలు హరించిపోతయ్.

🍇క్షయదగ్గు – తగ్గిపోవుటకు

ఎండుద్రాక్షపండ్లు, విప్పపువ్వు, ఎండు అంజూర్ పండ్లు. సమంగా కలిపి మెత్తగాదంచి నిలువ వుంచుకోవాలి. రెండుపూటలా 20గ్రా॥ మోతా దుగా ఈ ముద్దనుతింటుంటే క్షయదగ్గు తగ్గుతుంది.

రక్తపైత్యం రక్తప్రవాహం కట్టుటకు

ఎండు ద్రాక్షపండ్లు, మంచిగంధంపొడి, లొద్దుగ చెక్కపొడి సమానభాగాలుగా తీసుకొని తగినంత తేనెతో ముద్దలాగదంచినిలువ
వుంచుకోవాలి.
రెండుపూటలా పూటకు ఉసిరిక కాయంత ముద్దు తింటూవుంటే భయంకరమైన ఉష్ణరోగాలు, రక్తపోవడంవంటి రక్తపిత్త సమస్యలు హరించిపోతయ్.