నోటిలో లాలాజలము ఎందుకు…!!!!

తెలుసుకుందాం..

నోటిలో లాలాజలము ఎందుకు.

నీళ్ళలా ఉండి, జిగటగా ఉండే రంగులేని పదార్ధమే లాలాజలము. ఆహారం జీర్ణం కావడానికిది అత్యంతవసరం. దీనిలో 98% నీరు, 2% ఎంజైములు ఉంటాయి. ఎంజైములలో కెల్లా ముఖ్యమైనది ‘టైలిన్‌’. ఇది నమిలిన ఆహారాన్ని పంచదారగా మారుస్తుంది. దీన్నే ‘మాల్టోస్‌’ అంటారు. దీని మరో ఎంజైమ్‌ ‘లిసోజిమ్‌’. ఇది నోటి ద్వారా శరీరంలో ప్రవేశించే బాక్టీరియాను నాశనం చేస్తుంది. ఆహారాన్ని బాగా నమిలితే నోటిలో లాలాజలం బాగా ఊరుతుంది. అన్న నాళం గుండా ఆహారం ఉదరంలోకి సులువుగా చేరడానికి సహాయపడుతుంది. నోటిని తడిగా ఉంచుతుంది. ఆహారాన్ని చూడగానే నరాలు లాలాజల గ్రంధులకు సంకేతాన్నిస్తాయి. అప్పుడు గ్రంధుల నుంచి ‘లాలాజలం’ స్రవించనారంభిస్తుంది. ప్రతిరోజూ మన నోటి నుండి 1.5 లీటర్ల లాలాజలం ఊరుతుంది…!మన జీవిత కాలములో ఒక వ్యక్తి లో ఊరే లాలాజము సుమారు 2 స్విమ్మింగ్ ఫూల్స్ నిండేంత ఉంటుంది.

నోటిలో లాలాజలము నిరంతరము ఊరడము వలన నోరు , నాలుక ఎండిపోకుండా ఉంటాయి.
పెదవులు పగిలి పోకుండా ఉంటాయి,
నాలుకను రచించేది లాలాజలమే ,
మనము తిన్న ఆహారానికి తేమను కలిపి సులువుగా గొంతులొనికు జారవేస్తుందీ లాలాజలమే.
లాలాజలము ఉండబట్టే ఆహారము రుచులు తెలుసుకోవడము వీలవుతుంది .