చేపలు తిన్న తర్వాత పాలు తాగినప్పుడు చర్మ సంబంధిత వ్యాధులు..!!?

చేపలను చాలా మంది ఇష్టంగా లాగించేస్తుంటారు. రకరకాల చేపలు ఫ్రై, చేపల పులుసు, ఫిష్ బిర్యానీ ఇష్టంగా తినేవారు చాలా మందే ఉంటారు. వారందరికీ ఎప్పుడో ఒకప్పుడు పెద్ద వాళ్ల నుంచి ఒక సూచన లేదా హెచ్చరిక వచ్చే ఉంటుంది. అదేంటంటే.. ఫిష్ తిన్న తర్వాత పాలు తాగవద్దని, పెరుగు తినవద్దని చెప్పడం చాలా మందికి తెలిసిందే…

ఆహారం విషయంలో ఎన్నో అపోహలున్నాయి.
మన పూర్వికులు, పెద్దవారి నుంచి ఇలాంటివి తరచుగా వింటూ ఉంటాం. చేపలు తిన్న తర్వాత పాలు తాగినప్పుడు చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయని చెబుతుంటారు..ముఖ్యంగా బొల్లి వస్తుందని బాగా ప్రచారంలో ఉంది. ఇది ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం… చేపల తర్వాత పాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఏ విధంగానూ హానికరం కాదని, అందుకు శాస్త్రీయ ఆధారాలు లేవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చేపలు, పాలు అధిక ప్రొటీన్ కలవి… వాటిని జీర్ణం చేసే సమయంలో పెద్ద మొత్తంలో శక్తిని విడుదల చేస్తుంది. ఇది పొట్ట ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. చర్మంపై తెల్లమచ్చలు రావడాన్ని బొల్లిగా పిలుస్తారు. చర్మంలో రంగుకు కారణమయ్యే పిగ్మింటేషన్ స్థాయిలు తగ్గిపోతే బొల్లి వస్తుంది. అదొక ఆటోఇమ్యూన్ వ్యాధి అని దానికి , చేపలు, పాలు కలిపి తినడానికి సంబంధం లేదని కొట్టి పారేస్తున్నారు. మెలనిన్‌పై పోరాడే యాంటీబాడీలను రోగ నిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేయడం వల్ల బొల్లి వస్తుందని డెర్మలాటజిస్టులు చెబుతున్నారు. చేపలు, పాలు తింటే తెల్ల మచ్చలు వస్తాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవంటున్నారు..ఏదైనా విపరీతంగా తింటే మీ జీర్ణ వ్యవస్థపై అది ప్రభావం చూపుతుంది. రోడ్ సైడ్ దొరికే కొన్ని రకాల ఫుడ్స్ వల్ల అలర్జీలు రావచ్చు. మరికొంతమందికి కొన్ని ఆహార పదార్థాలు పడకపోవచ్చు. అలాంటప్పుడు వచ్చే అలర్జీలను అందరికీ ఆపాదించకూడదని నిపుణులు అంటున్నారు. ఉదాహారణకు పోచ్డ్ ఫిష్ వంటి డిష్‌లను చేపలు, పాలు కలిపే తయారు చేస్తారు. ఆరోగ్యకరమైన రీతిలో ఆహారం తీసుకుంటే ప్రాణాలకు ముప్పు ఉండదు. చర్మంపై మచ్చలకు పాలు లేదా చేపలకు ఎలాంటి సంబంధం లేదన్నది డైటీషియలన్ల వెర్షన్.