ఎండ‌లో తిర‌గ‌డం వ‌ల్ల తలనొప్పి వస్తే…ఇలా చేస్తే త‌ల నొప్పి ఇట్టే పోతుంది…

స‌మ్మ‌ర్‌లో త‌ల‌నొప్పి రావ‌డానికి డీహైడ్రేష‌న్ ఒక కార‌ణంగా చెప్పొచ్చు.

అందువ‌ల్ల‌, త‌ర‌చూ నీటితో పాటు కొబ్బ‌రి నీళ్లు, మ‌జ్జిగ‌, ల‌స్సీ వంటివి తీసుకుంటే హైడ్రేట‌డ్‌గా ఉంటారు.త‌ల నొప్పి ప‌రార్ అవుతుంది..త‌ల‌నొప్పి తీవ్రంగా ఉన్న‌ప్పుడు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ ర‌సం క‌లిపి తీసుకోవాలి.ఇలా చేస్తే త‌ల‌నొప్పి నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం పొందుతారు…వేసవిలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య ఇదే. బయటి ఉష్ణోగ్రతలతోపాటే శరీర ఉష్ణోగ్రత కూడా బాగా పెరిగిపోతుంది. దీంతో చెమట రూపంలో శరీరం తననితాను చల్లబరుచుకొనే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో శరీరంలో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. చెమటతోపాటు శరీరంలో ఉండే పొటాషియం, సోడియం, క్లోరైడ్, పాస్పరస్‌ వంటి లవణాలు కూడా బయటకు పోతాయి. ఇవి తిరిగి శరీరంలోకి చేరాలంటే తప్పకుండా నీళ్లు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తాగాలి. శీతల పానీయలు తాగకూడదు. డీ హైడ్రేషన్ వడదెబ్బకు గురిచేస్తుంది. పైన పేర్కొన్న వడదెబ్బ లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే చక్కెర, ఉప్పు కలిసిన నీరు తాగాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. డీహైడ్రేషన్‌కు గురైనవారికి వాంతలు, వికారం, జ్వరం, కడుపునొప్పి వస్తాయి. నీళ్ల విరోచనాలవుతాయి. చర్మం పొడిబారినా, చెమట పట్టకపోయినా, మూత్రం రాకపోయినా డీహైడ్రేషన్‌కు గురైనట్లే….
ఒంట్లో వేడి ఎక్కువైనా త‌ల నొప్పి వ‌స్తుంటుంది.అందుకే స‌మ్మ‌ర్‌లో చ‌లువ చేసే ఆహారాల‌ను తీసుకోవాలి.ముఖ్యంగా స‌బ్జా వాట‌ర్‌, పుచ్చ‌కాయ‌లు, క‌ర్బుజా, కీర దోస‌, పుదీనా, మెంతులు వంటివి డైట్‌లో చేర్చుకుంటే త‌ల నొప్పి రాకుండా ఉంటుంది….

త‌ల‌నొప్పికి చెక్ పెట్ట‌డంలో గంధం పొడి గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

గంధం చెక్క‌ను అర‌గ దీసి నుదుటిపై పూయాలి. ఇలా చేస్తే త‌ల నొప్పి ఇట్టే పోతుంది.

ఎండ‌లో తిర‌గ‌డం వ‌ల్ల తలనొప్పి వస్తే.చ‌ల్ల‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి…విశ్రాంతి తీసుకుంటే.త‌ల నొప్పి దూరం అవుతుంది.

మ‌ద్యం అల‌వాటు ఉన్న వారికి స‌మ్మ‌ర్ లో త‌ల‌నొప్పి ఎక్కువ‌గా ఉంటుంది.కాబ‌ట్టి, మ‌ద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది…