చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన హీరో అజిత్..!

స్టార్ హీరో అజిత్ చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.ఎందుకు ఉన్నట్లుండి ఆసుపత్రిలో చేరారంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే తల ఆసుపత్రిలో చేరడం గురించి ఇప్పటివరకు అధికారికంగా క్లారిటీ మాత్రం రాలేదు. ఆయన ప్రస్తుతం విడతల మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకు అజిత్ వచ్చే వారం విదేశాలకు వెళ్లనున్నారు. ఇందులో భాగంగా సాధారణ పరీక్షల కోసం అంటే కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆసుపత్రిలో చేరినట్లు కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. రేపు ఆయన డిశార్చ్ కానున్నట్లు తెలుస్తోంది. తెగింపు తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు అజిత్. కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసినప్పటికీ ఆ మూవీ షూటింగ్స్ చాలా స్లోగా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్స్ గురించి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో కొంత డ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..గతేడాది అక్టోబర్ లో అజర్ బైజాన్ లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కానీ అనేక అడ్డంకుల కారణంగా చాలాసార్లు ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత ఈ మూవీ డైరెక్టర్ మిలన్ గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో మరికొన్ని నెలలు ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. ఇక ఆ తర్వాత నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ ఆర్థిక సమస్యల కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిపివేసిందని టాక్ నడిచింది. అలాగే చాలా సవాళ్లు ఎదుర్కొని మళ్లీ ఈ మూవీ షూటింగ్ వేగంగా స్టార్ట్ చేశారు. కానీ ఆ సమయంలో ప్రకృతి కోపానికి తలొగ్గారు. అజర్ బైజాన్ ప్రాంతంలో విపరీతంగా మంచు కురుస్తుండడంతో ఈమూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పడిప్పుడే చిత్రీకరణపై అప్డేట్స్ నెట్టింట వైరలవుతుండగా.. ఇప్పుడేమో అజిత్ ఆసుపత్రిలో చేరారు. దీంతో విడతల మూవీపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుంది…ఇదిలా ఉంటే.. ఇన్నాళ్లు ఆగిపోయిన ఈ చిత్రీకరణను తిరిగి స్టార్ట్ చేయనుంది చిత్రయూనిట్. మార్చి 15న అజర్ బైజాన్ ప్రాంతంలో దాదాపు 30 రోజులపాటు షూటింగ్ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లాల్సి రావడంతో అజిత్ నార్మల్ చెకప్ కోసం ఆసుపత్రిలో చేరారని.. ఆయనను రేపు డిశ్చార్చ్ చేయనున్నట్లు సమాచారం..