Hero మోటార్స్ కంపెనీ కొత్తగా Xtreme 200S 4V బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.41 లక్షలు. ఇది 199.6cc 4V ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. 8,000 rpm వద్ద 18.8 bhp శక్తిని పొందుతుంది. అదే 6500 rpm వద్ద 17.35 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించారు. నావిగేషన్, కాల్/SMS నోటిఫికేషన్ అందించే బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు, ముందు LED హెడ్‌లైట్ అమర్చారు. అలాగే, సైడ్-స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ ఫంక్షన్‌ను కూడా ఇచ్చారు. బైక్ ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనక మోనోషాక్ అబ్బర్వ్‌లను అందించారు, ముందు టైరుకు మాత్రమే ABS మాత్రమే లభిస్తుంది.ఇది మూన్ ఎల్లో, పాంథర్ బ్లాక్ మెటాలిక్, ప్రీమియం స్టీల్త్ ఎడిషన్ ఉన్నాయి. దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.