చెరువుల కబ్జాల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ…

చెరువుల కబ్జాల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: చెరువుల కబ్జాల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎఫ్‌టీఎల్‌లో అక్రమంగా నిర్మిస్తున్నారని పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు. నోటిఫైడ్‌ ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు జరపవద్దంటూ..మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాది శరత్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో చెరువుల కబ్జాపై వేసిన పిటిషన్స్ అన్నింటినీ ఒకేసారి వింటామని ప్రధానన్యాయమూర్తితో కూడిన డివిజన్ బెంచ్ తెలిపింది. హెచ్‌ఎండీఏ పరిధి ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు వెంటనే ఆపాలని..హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లకు హైకోర్టు ఆదేశించింది.