మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ లో హల్చల్ చేసినా 46 మంది హిజ్రాల బైండోవర్.

46 మంది హిజ్రాల బైండోవర్.
మిర్యాలగూడ(miryalaguda) పట్టణంలోని ఒన్ టౌన్ పోలిస్ స్టేషన్‌లో మంగళవారం రెండు వర్గాల హిజ్రాలు గొడవ పడ్డ సంఘటనలో వన్ టౌన్ పోలీసులు చర్యలు చేపట్టారు. బుధవారం నందిని, బాలమ్మ వర్గాలకు చెందిన 46 మంది హిజ్రాలపై సీ ఆర్పీ సీ 107(crp) క్రింద కేసు నమోదు చేసి తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. శుభకార్యాలు , నూతన వ్యాపారాల ఓపెనింగ్ ల వద్దకెళ్ళి డబ్బు వసూళ్ళకు పాల్పడితే డయల్ 100 కి లేదా పోలీసులకు సమాచారమివ్వాలని సిఐ రాఘవేంద్ర కోరారు.

శుభకార్యాలు, వ్యాపార సంస్థల వద్దకి గుంపులుగా వెళ్లి యాచన పేరుతో డబ్బు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోడలపై, ఫంక్షన్ హాల్ వద్ద వర్గాల పేర్లు రాసి బలవంతపు వసూళ్లకు దిగితే డయల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. హిజ్రాలకు డబ్బులిచ్చి ప్రోత్సహించిన వారు కూడా శిక్షర్హులేనన్నారు. కార్యక్రమంలో ఎస్ ఐ లు శ్రీను నాయక్, శివ తేజలు ఉన్నారు..