దేశ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన: ప్రధాని, రాష్ట్రపతి..

హోళీ పండగ సందర్భంగా దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలంతా తన కుటుంబ సభ్యులని, ప్రతివారి జీవితంలో అభిమానం, సామరస్యం పెంపొందించే ఈ పండగ కొత్త శక్తిని, ఉత్సాహాన్ని తీసుకురా గలదని ప్రధాని ఆకాంక్షిం చారు.

ఈ సందర్భంగా ప్రజలు నిర్వహించే హోళికా దహన్ చెడును దహించడానికి సంకేతమని, అంతకు ముందు దేశం మొత్తం మీద ఈ పండగను రంగురంగుల జల్లులతో, తమ సంప్రదా య రీతుల్లో జరుపుకోవడం ఆనందదాయకమని ప్రధాని మోడీ తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

హోళీ పండగ ప్రజల్లో ప్రేమ, సోదరభావం, సమైక్యత పెంపొందిస్తుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు తన సందేశంలో వివరించారు.

వివిధ రంగులు ఆనందంతో వెదజల్లే పండగైన ఈ పండ గ దేశం లోని వైవిధ్యతకు ప్రతిబింబమని, మన సాంస్కృతిక వారసత్వాన్ని మరింత బలోపేతం చేసేలా స్ఫూర్తినిస్తుందని పేర్కొ న్నారు.

జీవితాల్లో ఆశను, అత్యా సక్తిని ప్రేరేపిస్తుందన్నారు. ప్రతివారి జీవితంలో ఈ పండగ రంగులు ఆనందం కలిగించాలని తాను ఆకాంక్షిస్తున్నానని రాష్ట్రపతి తన సందేశంలో అభిలషించారు.

మనందరి అభిప్రాయాలు కొత్త ఉత్సాహంతో జాతి నిర్మాణం వైపు సాగాలని సూచించారు. దేశం లోను, విదేశాల్లోను నివసిస్తున్న భారతీయులందరికీ తన శుభాకాంక్షలు అందిస్తు న్నట్టు ఆమె చెప్పారు.