హిందీ బుల్లి తెర నటి వైభవి దుర్మరణం..

యువనటి అకాల మరణం బాలీవుడ్ లో విషాద ఛాయలు...

యువనటి అకాల మరణం బాలీవుడ్ లో విషాద ఛాయలు నింపింది. పలు సీరియల్స్ లో నటించిన వైభవి ఉపాధ్యాయ కారు ప్రమాదంలో మరణించింది. వైభవి ఉపాధ్యాయ ప్రయాణిస్తున్న కారు లోయలో పడటంతో ఆమె అక్కడిక్కకే మృతి చెందారు. వైభవికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. మంగళవారం ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. అక్కడ హిల్ స్టేషన్స్ సందర్శించారు. ట్రిప్ ముగించుకుని వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు లోయలో పడింది. …ఈ ప్రమాదంలో వైభవి అక్కడిక్కడే మృతి చెందారని సమాచారం. ఆమె ప్రియుడు మాత్రం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైభవి మృతి వార్త తెలిసిన వెంటనే ఆమె సోదరుడు హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. ముంబైకి వైభవి మృతదేహం తరలించారు. నేడు వైభవి అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.