చరిత్రలో ఈరోజు…

* చరిత్రలో ఈరోజు *

*అక్టోబర్ 31*

*సంఘటనలు*

1840: మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి.) లెక్స్ లోసి (Lex Loci, భారతదేశంలో, ఇంగ్లీష్ లా యొక్క పాత్ర, అధికారం గురించిన నివేదికను ఇచ్చాడు.

1984: భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ నియమితుడైనాడు.

2000: డిసెంబర్ 22 న ఢిల్లీ లోని ఎర్రకోటలోకి ప్రవేశించిన ఐదుగురు ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు.

2005: ఎర్రకోటపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, లష్కరేతొయిబా ఉగ్రవాది, మొహమ్మద్ ఆరిఫ్ అష్ఫాక్ కు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది.

*జననాలు*

1875: సర్దార్ వల్లభభాయి పటేల్, భారతదేశపు ఉక్కుమనిషి. (మ. 1950)

1889: ఆచార్య నరేంద్ర దేవ్. (మ.1956)

1895: సి.కె.నాయుడు, భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్, పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు. (మ.1967)

1925: కోటయ్య ప్రత్యగాత్మ, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (మ.2001)

1937: నరిశెట్టి ఇన్నయ్య, హేతువాది, తెలుగులో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర రచించాడు.

1946: కరణం బలరామకృష్ణ మూర్తి, రాజకీయ నాయకుడు.

మరణాలు.

1974: మాచిరాజు దేవీప్రసాద్, తనది “వికట కవిత్వం” అని, ఎగతాళి చేయడం తన పని అని తానే చెప్పుకున్నాడు. సాహితీ రంగంలో తనది విదూషక పాత్ర అని విశ్వసించాడు. (జ. 1922)

1984: ఇందిరా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (జ.1917)

1984: వానమామలై వరదాచార్యులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ పండితుడు, రచయిత. (జ.1912)

1990: ఎం. ఎల్. వసంతకుమారి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరియు దక్షిణ భారత చలనచిత్రరంగంలో ప్రముఖ నేపథ్యగాయని. (జ.1928)

2003: అయ్యగారి సాంబశివరావు ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు మరియు పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. (జ.1914)

2004: కొమ్మూరి వేణుగోపాలరావు, తెలుగు నవలా రచయిత. (జ.1935)

2005: పి.లీల, మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. (జ.1934)

*?జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు*?

?హాలోవీన్ (Hallowe’en గా కూడా వ్రాస్తారు) అనేది అక్టోబరు 31న జరుపుకునే సెలవుదినం.

?క్రైస్తవ మతంలో ప్రొటస్టెంట్ సంఘాలకు చాలా ప్రాముఖ్యమైన రోజు…మార్టిన్ లూథర్ 95 చర్చనీయాంశాలు

?ఏక్తా దివస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి.

?ఇందిరాగాంధీ వర్ధంతి.

?ప్రపంచ పొదుపు దినోత్సవం

?జాతీయ ఐక్యతా దినోత్సవం