చరిత్రలో ఈరోజు..ఫిబ్రవరి 27.
గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 58వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 307 రోజులు (లీపు సంవత్సరములో 308 రోజులు) మిగిలినవి.
*?️సంఘటనలు?️*
1803: ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది.
1933: హిట్లరు నియంతృత్వ పాలనకు దారితీసిన జర్మనీ పార్లమెంటు భవన దహనం జరిగింది.
2002: అహమ్మదాబాద్ వెళుతున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగిలో పెట్రోలు పోసి దహనం చేయడం వల్ల అయోధ్య నుంచి వస్తున్న59 మంది విశ్వహిందూ పరిషత్తు కరసేవకులు మరణించారు.
*??జననాలు??
1932: వేగె నాగేశ్వరరావు, కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణులు, బహుభాషావేత్త.
1943: బి.ఎస్.యడ్యూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.
*??మరణాలు??*
1712: మొదటి బహదూర్ షా, భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి. (జ.1643)
1931: చంద్రశేఖర్ ఆజాద్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (జ.1906)
1956: జి.వి.మావలాంకర్, లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (జ.1888)
1985: ఆకురాతి చలమయ్య, తెలుగు రచయిత. హేతువాది, వీరి “రవీంద్ర భాస్కరం” రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
2017: పి. శివశంకర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి. (జ.1929)